Site icon NTV Telugu

Tollywood Movies : మే లో సినిమాల సందడి .. ఒక్కరోజే ఆరు సినిమాలు రిలీజ్..

May 31

May 31

ప్రతి నెల కొత్త సినిమాలు విడుదల అవుతాయి.. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. ఇక ఈ నెల 31 న భారీగా సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఈ రోజున ఏకంగా ఆరు సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఏయే సినిమాలు విడుదల అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హరోంహర..

సుధీర్ బాబు హీరోగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’. సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంది..మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్, అక్షర గౌడ కీలకపాత్రలు పోషిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. మే 31న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది..

సత్యభామ..

సుమన్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి ‘సత్యభామ’ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు… ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది.. ఈ సినిమా కూడా అదే రోజున విడుదల కాబోతుంది..

భజే వాయువేగం..

కార్తికేయ హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నాడు. లాస్ట్ ఇయర్ బెదురులంక తో హిట్ అందుకున్నాడు ఈ హీరో. ఇక ఇప్పుడు “భజే వాయువేగం” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.. రాహుల్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై ఆసక్తిని కలిగిస్తున్నాయి.. ఈ సినిమా మే 31 న విడుదల కాబోతుంది.

గం గం గణేశ..

నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి దర్శకత్వంలో నటుడు ఆనంద్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే..’గం గం గణేశ’ అనే టైటిల్ ని లాక్ చేసారు.. ఈ సినిమా సాంగ్ రీసెంట్ గా రిలీజ్ చేశారు.. ఇక ఈ సినిమాను మే 31 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..

మ్యూజిక్ షాప్ మూర్తి..

తెలుగు నటుడు అజయ్ ఘోష్, ప్రముఖ హీరోయిన్ చాందిని తండ్రీ కూతుర్లుగా రాబోతున్న సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి.. విలన్ మరియు కామెడీ పాత్ర లలో ప్రేక్షకులని అలరించిన నటుడు ఇప్పుడు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.ఈ సినిమా మే 31 న రిలీజ్ కాబోతుంది..

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..

విశ్వక్‌సేన్, నేహా శెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ మళ్ళీ వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. మే 17 న విడుదల కావాల్సింది కానీ మళ్లీ పోస్ట్ పోన్ అయ్యింది.. ఇప్పుడు మే 31 న రిలీజ్ కానుంది..తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు..

Exit mobile version