Tollywood Movies : మే లో సినిమాల సందడి .. ఒక్కరోజే ఆరు సినిమాలు రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి నెల కొత్త సినిమాలు విడుదల అవుతాయి.. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయితే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి.. ఇక ఈ నెల 31 న భారీగా సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఈ రోజున ఏకంగా ఆరు సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఏయే సినిమాలు విడుదల అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
హరోంహర..
Also Read
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
సుధీర్ బాబు హీరోగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’. సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంది..మాళవిక శర్మ హీరోయిన్. సునీల్, అక్షర గౌడ కీలకపాత్రలు పోషిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. మే 31న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది..
సత్యభామ..
సుమన్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి ‘సత్యభామ’ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు… ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది.. ఈ సినిమా కూడా అదే రోజున విడుదల కాబోతుంది..
భజే వాయువేగం..
కార్తికేయ హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నాడు. లాస్ట్ ఇయర్ బెదురులంక తో హిట్ అందుకున్నాడు ఈ హీరో. ఇక ఇప్పుడు “భజే వాయువేగం” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.. రాహుల్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై ఆసక్తిని కలిగిస్తున్నాయి.. ఈ సినిమా మే 31 న విడుదల కాబోతుంది.
గం గం గణేశ..
నూతన దర్శకుడు ఉదయ్ శెట్టి దర్శకత్వంలో నటుడు ఆనంద్ దేవరకొండ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే..’గం గం గణేశ’ అనే టైటిల్ ని లాక్ చేసారు.. ఈ సినిమా సాంగ్ రీసెంట్ గా రిలీజ్ చేశారు.. ఇక ఈ సినిమాను మే 31 న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు..
మ్యూజిక్ షాప్ మూర్తి..
తెలుగు నటుడు అజయ్ ఘోష్, ప్రముఖ హీరోయిన్ చాందిని తండ్రీ కూతుర్లుగా రాబోతున్న సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి.. విలన్ మరియు కామెడీ పాత్ర లలో ప్రేక్షకులని అలరించిన నటుడు ఇప్పుడు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.ఈ సినిమా మే 31 న రిలీజ్ కాబోతుంది..
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..
విశ్వక్‌సేన్, నేహా శెట్టి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మళ్ళీ వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. మే 17 న విడుదల కావాల్సింది కానీ మళ్లీ పోస్ట్ పోన్ అయ్యింది.. ఇప్పుడు మే 31 న రిలీజ్ కానుంది..తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు..
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!