Matka Movie: మెగా ఫ్యామిలీలో ప్రయోగాత్మక సినిమాలతో జనాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుణ్ సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అసలు ఇలాంటి స్టోరి మనం ఇంతకు ముందెప్పుడూ చూడలేదే అనేంత కొత్త కాన్సెప్ట్‌తో వస్తుంటాడు. సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. ఆడియెన్స్‌కు మాత్రం వరుణ్ తేజ్ సినిమాలు మాత్రం సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంటాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ముకుంద సినిమాతో తెరంగేట్రం చేశాడు వరుణ్ తేజ్. తొలి సినిమాకే పొలిటికల్ టచ్ ఉన్న కాన్సెప్ట్‌తో వచ్చాడు. సినిమా పెద్దగా ఆడకపోయినా కానీ.. వరుణ్‌లో టాలెంట్ ఉందని మాత్రం నిరూపితమైంది. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ అంటూ మరో యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లను పక్కనబెడితే, నటుడిగా మాత్రం వరుణ్ కు వందకు వంద మార్కులు పడ్డాయి.
Read Also:Maharashtra: మహారాష్ట్రలో కాంగ్రెస్కు బిగ్ షాక్.. ఎన్సీపీలో చేరిన ఇగత్‌పురి ఎమ్మెల్యే
దీంతో ఆయన సినిమాల పై జనాలకు ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలోనే తన తాజా చిత్రం మట్కాపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ గెటప్‌లు, నటనలో వేరియేషన్స్ ఆకట్టుకున్నాయి. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రానికి కరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. మట్కా సినిమాకు మంచి క్రేజ్ రావడంతో ఓటీటీ డీల్ కుదిరింది. మట్కా సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‌ఫాం సొంతం చేసుకున్నట్లు సమాచారం. క్రేజ్ దృష్ట్యా మంచి ధరకు కొనుగోలు చేశారన్నారు. థియేట్రికల్ రన్ తర్వాత, సినిమా ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానున్న మట్కా చిత్రం.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సినిమా థియేటర్లలో విడుదలైన ఒక నెల తర్వాత ప్రైమ్ వీడియోలో వచ్చే అవకాశం ఉంది.
Read Also:Nithya Menon: ‘ఇడ్లీ కొట్టు’ నడపబోతున్న ధనుష్- నిత్యామీనన్.. వైరల్ అవుతున్న పోస్ట్