NTV Telugu Site icon

MS DHONI: మీకు పరేషాన్ వొద్దు.. మీవోడు ఇప్పటి నుంచి నా మనిషి..

Pathirana

Pathirana

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాలలో కీలక పాత్ర వహిస్తున్న డెత్ స్పెషలిస్టుగా ఎదుగుతున్న యువ సంచలనం మతీశ పతిరాన.. తన ఫ్యామిలీతో కలిసి చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనిని కలిశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రెండో సీజన్ ఆడుతున్న పతిరాన.. ఈ ఏడాది సీఎస్కేకి మెయిన్ బౌలర్ గా మారాడు. అయితే 20 ఏళ్ల కుమారుడిపై బెంగ పెట్టుకుని చెన్నైకి వచ్చిన పతిరాన తల్లిదండ్రులకు.. అతడి కుటుంబానికి ధోని ధైర్యం చెప్పాడు. పతిరాన తన సొంత మనిషి అని.. అతడి భవిష్యత్ గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధోని వారికి హామీ ఇచ్చాడు.

Also Read : YS Avinash Reddy: వైఎస్‌ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి హెల్త్ బులెటిన్ విడుదల.. మెరుగైన వైద్యం కోసం..

ఈ మేరకు పతిరాన సోదరి ( విషుక పతిరాన ) తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ ఫోటోలను పంచుకుని ధోని తమకు హామీ ఇచ్చిన విషయాన్ని వెల్లడించింది. చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్ లో ధోనిని కలిసిన పతిరాన కుటుంబానికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. మా మల్లి (పతిరాన ముద్దుపేరు) సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాడని రాసుకొచ్చింది. మా మల్లి ఇప్పుడు సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాడు.. మీరు పతిరాన గురించి దిగులు చెందాల్సిన పన్లేదు.. అతడెప్పుడూ నాతోనే ఉంటాడు అని తాలా మాకు చెప్పాడు అని వెల్లడించింది. ధోనిని కలిసిన క్షణాలు నేను కలగన్నదానికంటే మించి ఉన్నాయి అని ఆమె ఇన్ స్టా పోస్ట్ లో తెలిపింది.

Also Read : Dimple Hayati: డింపుల్ ఇంట్లోకి అపరిచుతులు… లిఫ్ట్ వరకూ తరిమిన కుక్క

కాగా.. ఈ సీజన్ లో పతిరానను ధోని బాగా ప్రోత్సహిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలిచిన ప్రతీసారి ధోని.. పతిరానపై ప్రశంసలు కురిపించాడు. అతడు ఇప్పుడప్పడే టెస్టులకు రాకూడదని.. ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఆడాలని తెలిపాడు. ఇక ఐపీఎల్16 లో పతిరాన.. 11 మ్యాచ్ లలో 42.2 ఓవర్లు బౌలింగ్ వేసి 17 వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే చెన్నై-గుజరాత్ మధ్య జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్ లో పతిరాన నాలుగు ఓవర్లు వేసి 37 పరుగులిచ్చినా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక గుజరాత్ పై గెలిచిన సీఎస్కే.. నేడు ముంబై-గుజరాత్ మధ్య జరుగబోయే క్వాలిఫయర్ -2లో విజేతతో మే 28 ( ఆదివారం )న ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.