OTT : శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా. ఈ సినిమా 2019లో విడుదలై సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సిక్వెల్ గా వచ్చిన చిత్రం మత్తువదలరా -2. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రానా సీక్వెల్ కు కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్‌కు తగ్గట్లుగానే సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ రివ్యూలు దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. శ్రీ సింహ కోడూరి, సత్య కామెడీ నవ్వులు పూయించి, హెలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్‌గానిలిచింది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు.
Read Also:Isreal- Gaza Conflict: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ దాడి.. 27 మంది మృతి
థియేటర్లల్లో భారీ కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ విషయమై అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు తీసుకు వస్తున్నట్టు ఆ పోస్టర్ లో పేర్కొన్నారు. థియేటర్ లో 28 రోజులు రన్ తర్వాత ఓటీటీ లోకి వస్తోంది. మరి ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీ రిలీజ్ కి వచ్చేసింది. సో ఈ క్రేజీ థ్రిల్లర్ కామెడీని చూడాలి అనుకునే వారు నెట్ ఫ్లిక్స్ లో ట్రై చేయవచ్చు. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లో ఏ మేరకు రాణిస్తుందో ఎన్ని మిలియన్ వ్యూస్ రాబడుతుందో చూడలి. దసరా కానుకగా వచ్చిన మత్తువదలరా -2 ను ఓటీటీ లో చూస్తూ ఎంజాయ్ చేసేయండి. ఫరియా అబ్దుల్లా ఫీమేల్ లీడ్ లో నటించింది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
Read Also:Panthangi Toll Plaza: దసరా ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్..