NTV Telugu Site icon

Masth Shades Unnai Ra: తనలోని షేడ్స్ చూపించడానికి వచ్చేస్తున్న అభినవ్..

Abhinav

Abhinav

ఈ మధ్య పలు సినిమాల్లో కమెడియన్ చేసిన చాలా మంది ఇప్పుడు హీరోగా చేస్తున్నారు.. అందులో కొందరు భారీ సక్సెస్ ను కూడా తమ ఖాతాలో వేసుకున్నారు.. ఇప్పుడు మరో కమెడియన్ హీరోగా తనలోని షెడ్స్ ను చూపించడానికి వచ్చేస్తున్నాడు.. అతను ఎవరో కాదు అభినవ్ గోమఠం.. కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న అభినవ్ గోమఠం హీరోగా నటిస్తున్న చిత్రం ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్ రా’. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం నుంచి రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలై ఆకట్టుకుంది..

అలాగే మొన్న విడుదల అయిన రొమాంటిక్ సాంగ్ కూడా ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు తాజాగా మేకర్స్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేశారు..కామెడీతో పాటు లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా, దాంతో పాటు చిన్నపాటి మెసేజ్ కూడా ఉంటుందని ట్రైలర్ చూసాక తెలుస్తుంది. గోదావరి ప్రాంతంలో ఒక చిన్న పలెటూళ్లో మనోహర్ అనే వ్యక్తి గొప్ప పెయింటర్ గాని, లేదా దానిపై మంచి బిజినెస్ గాని పెట్టి లైఫ్ లో సెటిల్ అవుదామని కలలు గంటూ, ఊళ్ళో వాళ్ళు అంటే మాటలు పడుతూ కష్టపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో పరిచయమైన ఉమాదేవి తన కి ఎలా సహాయపడింది. మధ్యలో వీళ్ళ లవ్ ట్రాక్ ఏంటి? అనేది ఈ సినిమా కథ..

ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఇక సినిమా విషయానికొస్తే.. ఇక ఈ సినిమా ఎలా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి.. కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పైన వచ్చిన ఈ చిత్రాన్ని తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వం వహించగా.. భవాని కాసుల, అరీం రెడ్డి అండ్ ప్రశాంతి వి ప్రొడ్యూస్ చేశారు.. పులిమేర 2 చిత్రం ద్వారా వంశీ నందిపాటికి ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ గా మంచి పేరు వచ్చింది, ఈ వంశీ నందిపాటి ఈ మస్తు షేడ్స్ ఉన్నాయి రా చిత్రాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 23న విడుదల చేయబోతున్నారు..
Masthu Shades Unnai Ra Trailer | Abhinav Gomatam, Vaishali Raj | Thirupathi Rao Indla | Sanjeev T