Site icon NTV Telugu

Mstan Sai Case: మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం..

Mastan Sai

Mastan Sai

మస్తాన్ సాయి కేసులో పోలీసులు కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు మస్తాన్ సాయిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సైబర్ నేరం, లైంగిక దోపిడీ, బ్లాక్ మెయిలింగ్ వంటి దురాగతాల కేసులో యూట్యూబర్ మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసింది. కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడంతో నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు.

READ MORE: Aaditya Thackeray: బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటోంది.. ఢిల్లీలో ఆదిత్య ఠాక్రే..

ఇదిలా ఉండగా… రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న మస్తాన్‌ సాయి కేసులో రోజు రోజుకూ రహస్యాలు బయటకు వస్తున్నాయి. యువతులను బ్లాక్ మెయిల్ చేసి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో బయటపడింది. నగ్న వీడియోల కేసులో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసులు జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. అలాగే మస్తాన్ సాయి ఎఫ్‌ఐఆర్‌లో కూడా కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. నగ్న వీడియోలే కాకుండా డ్రగ్స్ పార్టీలు కూడా చేసుకున్నట్లు బయటపడింది. వారాంతరాల్లో మస్తాన్ సాయి ఇంట్లో జరిగే డ్రగ్స్ పార్టీలకు యువతీయువకులు పాల్గొన్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో డ్రగ్స్ బయటపడటంతో నార్కోటిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. తాజాగా నార్సింగి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.

READ MORE: Indian Navy: డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? ఇండియన్ నేవీలో జాబ్స్ రెడీ.. ఇప్పుడే అప్లై చేసుకోండి

Exit mobile version