Site icon NTV Telugu

Massive Sinkhole: బిజీబిజీగా మెట్రో పనులు.. సడన్ గా బయటపడ్డ భారీ సింక్‌హోల్.! వీడియో వైరల్..

Massive Sinkhole

Massive Sinkhole

Massive Sinkhole: చైనాలోని షాంఘైలో రద్దీగా ఉండే రోడ్డులో భారీ సింక్‌హోల్ ఏర్పడి పెద్ద భాగాన్ని మింగేసింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడం, సమీప నిర్మాణాలు లోపలికి జారిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. క్షణాల్లోనే అక్కడ ఓ భారీ గుంత ఏర్పడింది.

Jasprit Bumrah: బుమ్రా భలే లక్కీ.. ఇతర ఆటగాళ్లకు లేని సౌలభ్యం, ఎప్పుడు కావాలంటే అప్పుడు!

షాంఘై నగరం భూగర్భ నిర్మాణ పరంగా సున్నితమైన ప్రాంతంగా గుర్తించబడింది. అక్కడ మృదువైన అల్యూవియల్ మట్టి, అధిక స్థాయిలో భూగర్భ జలాల వినియోగం, పలుచని ఇసుక పొరలు, పట్టణ నిర్మాణాల వల్ల ఏర్పడే ఖాళీలు వంటి అంశాలు తరచూ భూకుంగింపులకు దారితీస్తున్నాయి. చిన్న గుంతల నుంచి పెద్ద సింక్‌ హోల్‌ ల వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే తరహా ఘటన గతంలో కూడా చోటుచేసుకుంది. 2024 జనవరిలో షాంఘైలోని మిన్‌హాంగ్ జిల్లాలో ఒక కాలువ పైప్ దెబ్బతినడంతో సుమారు 10 మీటర్ల మేర రోడ్డుకుంగిపోయింది. ఆ సమయంలో ప్రాణనష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించింది.

IPL 2026: RCB అభిమానులకు గుడ్ న్యూస్.. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌లకు అనుమతి!

2017 నుంచి 2023 మధ్యకాలానికి సంబంధించిన డేటా ప్రకారం.. చైనాలో నమోదైన సింక్‌హోల్ ఘటనల్లో సుమారు 72 శాతం మానవ చర్యల కారణంగానే సంభవించాయని తెలుస్తోంది. నాసిరకం మౌలిక సదుపాయాలు, నిర్మాణ లోపాలు, అనియంత్రిత పట్టణాభివృద్ధి వంటి అంశాలు ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయి.

Exit mobile version