NTV Telugu Site icon

Viral Video: తన గుడ్లను తీస్తున్న వ్యక్తిపై కొండచిలువ దాడి.. షాకింగ్ వీడియో

Python Attack

Python Attack

Massive python attacks zookeeper for trying to take her eggs: పాముతో ఆటలాడితే అవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. చిర్రెత్తుకొచ్చిందా? ఒక్క దెబ్బకి కాటేస్తాయి. ఓ వ్యక్తి కొండచిలువ గుడ్లు తీయబోయాడు. అతనితో కొండచిలువ చేసిన ఫైట్ చూస్తే వణుకు పుడుతుంది. అయితే ఆయన దాని దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన జే బ్రూవర్ అనే వ్యక్తి స్నేక్‌ జూను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భయంకరమైన సర్పాలతో కూడిన వీడియోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుంటారు. బ్రూవర్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఒక వీడియో ఒళ్లు జలదరింప జేస్తున్నది. ఒక పెద్ద పాము ఆయనపై దాడి చేయగా తృటిలో తప్పించుకున్నారు.

Also Read: Viral News: ఇదెక్కడి దారుణం.. అధికారి భార్య చెప్పులిప్పించాడని అటెండర్ బట్టలిప్పించారు?

పాములతో సరదాకి పోతే ప్రాణాలే పోతాయి. ఓ వ్యక్తి కొండచిలువ గుడ్లు లాగడానికి ప్రయత్నించాడు. అతను ప్రయత్నించిన ప్రతి సారి అది కాటేయాలని చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కొండచిలువ పెట్టిన గుడ్లు తీసుకోవడానికి జూకీపర్ జే బ్రూవర్ అనే వ్యక్తి ప్రయత్నం చేశాడు. అతను గతంలో కూడా ఇలాంటి కొన్ని వీడియోలను షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అతను షేర్ చేసిన వీడియో నెటిజన్లను భయపెట్టింది. ఏ క్షణంలో అయినా కొండచిలువ అతనిని కాటేస్తుందేమో అని భయం కలిగించింది. ఈ వీడియో ఒకరోజు క్రితం పోస్ట్ చేసారు. 5 లక్షల వ్యూస్ దాటి దూసుకుపోతోంది. ఇక చాలామంది ఈ వీడియోపై స్పందించారు.

Also Read: Wagner Mutiny: రష్యాలో వాగ్నర్ తిరుగుబాటు.. సంచలన వ్యాఖ్యలు చేసిన జెలెన్స్కీ

‘అది విషపూరితమైనదా? జాగ్రత్త’ అంటూ చాలామంది కామెంట్లు పెట్టారు. ఎంత పాముల సంరక్షణపై అవగాహన ఉన్నా పెంచేవారి పట్ల కూడా అవి ఒక్కోసారి కఠినంగా ప్రవర్తిస్తాయి. వాటిని రెచ్చగొట్టే విధంగా ఏ మాత్రం ప్రవర్తించినా ప్రాణాలు తీస్తాయి. కావున కొండచిలువతో జాగ్రత్త అని నెటిజన్లు జే బ్రూవర్‌కు సూచించారు. ‘మీరు తృటిలో తప్పించుకున్నారు.. లేకపోతే మీ ముఖంపై పాము కాటు వేసేది’ అని కొందరు వ్యాఖ్యానించారు.