Site icon NTV Telugu

Gas Leakage: కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్.. భయాందోళనలో గ్రామస్తులు..

Gas

Gas

కోనసీమలో ఓఎన్జీసీ బావి నుంచి భారీగా గ్యాస్ లీకేజ్ కలకలం సృష్టించింది. ఒ ఎన్ జి సి అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. బ్లో అవుట్ తరహాలో మంటలు కూడా రావడంతో అదుపు
చేసేందుకు వెళ్లిన ONGC సిబ్బంది పరుగులు తీశారు. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ONGC బావి వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు జరిగిన క్రమంలో గ్యాస్ పైప్ లైన్ నుంచి ఈ లీకేజ్ సంభవించింది. భారీగా గ్యాస్ బయటకు వచ్చి గ్రామంలోకి వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గ్యాస్ లీకేజ్ అదుపు చేసేందుకు ప్రయత్నించగా భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. ప్రస్తుతం గ్యాస్ లీకేజ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Exit mobile version