జర్మనీని భారీ వరదలు ముంచెత్తాయి. దక్షిణ జర్మనీలోని బవేరియాలో ఈ వరదలు ముంచెత్తాయి. ఈ వరదలు కారణంగా ఇప్పటివరకు ఐదుగురు చనిపోయారు. అలాగే కార్లు కొట్టుకుపోయాయి. నివాస ప్రాంతాలు జలమయ్యాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. బవేరియా మరియు బాడెన్-వుర్టెంబెర్గ్‌లలో భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. బాధితుల్లో ఒక మహిళ వరదల్లో కొట్టుకుపోయింది.
దక్షిణ జర్మనీలో కొన్ని రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. మూడు నదులు కలిపే చారిత్రక నగరమైన పస్సౌలో నీటి మట్టాలు ఇప్పుడు 10మీ (32 అడుగులు)కి చేరుకున్నాయి. అలాగే ఆస్ట్రియా మరియు హంగేరిలో కూడా డానుబే నదీమట్టాలు కూడా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నది 6.86 మీటర్లకు చేరుకుంది. మధ్యాహ్నం సమయంలో గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇదిలా ఉంటే హంగేరీలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. నేషనల్ వాటర్ డైరెక్టరేట్‌కు చెందిన గాబ్రియెల్లా సిక్లోస్ హెచ్చరించారు. ప్రజలు అప్రతమత్తంగా ఉండాలని సూచించారు. తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అలర్ట్‌గా ఉండాలని హెచ్చరించారు.
ఇక రైన్ నదిలో రాకపోకలు బంద్ అయ్యాయి. కార్గో షిప్‌లు నదిలో నిలిచిపోయాయి. నీటి మట్టాలు తగ్గాకే యధావిధిగా రాకపోకలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
