Site icon NTV Telugu

UP fire: ఘజియాబాద్‌లో పేలిన జనరేటర్.. 4 ఫ్లాట్‌లు దగ్ధం

Feie

Feie

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘజియాబాద్‌లోని హౌసింగ్ కాంప్లెక్స్‌లో జనరేటర్ పేలడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో 4 ఫ్లాట్‌లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే మంటలు కారణంగా ఫ్లాట్‌లలోని ఫర్నిచర్, ఇతర వస్తువులు బూడిదయ్యాయి. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో జనరేటర్ ముందు ఉన్న నాలుగు ఫ్లాట్లు దగ్ధమయ్యాయి.

 

ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలోని అహింసాఖండ్-2లోని అరిహంత్ హార్మొనీ సొసైటీలో జనరేటర్‌లో మంటలు చెలరేగడంతో పేలుడు సంభవించింది. జనరేటర్ దగ్గర డీజిల్ డ్రమ్ములు ఉన్నాయి. దీంతో మంటలు వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. మంటలు వ్యాపించడంతో జనరేటర్ ముందు ఉన్న నాలుగు ఫ్లాట్లు దగ్ధమయ్యాయి. వీడియోలో నారింజ రంగు మంటలు సొసైటీ టెర్రస్‌పైకి చేరుకోవడం, ఆకాశంలో వంద అడుగులకు పైగా నల్లటి పొగ కమ్ముకుంది. మంటలు తీవ్రంగా ఉండటంతో పొరుగున ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కూడా మంటలు వ్యాపించాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో జోక్యం చేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటనాస్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని రెస్కూ టీం కోరింది. ఘటనా స్థలంలో ఐదు అగ్నిమాపక వాహనాలను మోహరించాయి. మంటలను ఆర్పడానికి సిబ్బంది రెండు నీటి గొట్టాలను ఏర్పాటు చేశారు. 45 నిమిషాల తర్వాత మంటలు అదుపులోకి వచ్చినట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాహుల్ పాల్ తెలిపారు. జనరేటర్‌లో మంటలు రావడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

 

Exit mobile version