హైదరాబాద్ పాత బస్తీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బేగంబజార్ లోని మహారాజ్ గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో భారీగా మంటలు వ్యాపించాయి. మంటల్లో దాదాపు 10 మంది చిక్కుకున్నట్లు సమాచారం. మంటలు దట్టంగా వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఇంటి లోపల చిక్కుకున్న వారిని బయటికి రప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఆరుగురిని భవనంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. మూడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులో డిస్పోజబుల్ ప్లేట్స్ గోదాము, రెండవ అంతస్తులో యజమాని నివాసం ఉంటున్నారు. మూడో అంతస్తులో మరొక కుటుంబం అద్దెకు ఉంటోంది. స్క్రాప్ గోదాంలో మంటలు ఎగసిపడి మూడంతస్తులకు వ్యాపించాయి.
