Site icon NTV Telugu

Hyderabad: ఆరాంఘర్‌లో అగ్నిప్రమాదం.. స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు

Aramghar Fire Accident

Aramghar Fire Accident

హైదరాబాద్‌లోని ఆరాంఘర్‌ చౌరస్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం. బస్సుల స్క్రాప్ గోదాంలో మంటల చెలరేగాయి. మంటల దాటికి దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కాగా.. ఈ ఘటనపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read Also: Amaravati: అమరావతి అభివృద్ధికి ముందడుగు.. ఢిల్లీలో కీలక భేటీ

షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆరాంఘర్ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కాగా.. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Read Also: Vikarabad: వికారాబాద్ కలెక్టర్‌కు నిరసన సెగ.. రాళ్ల దాడి

Exit mobile version