Fire In Mumbai : నవీ ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంబైలోని టర్బే డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. మంటలు చుట్టుపక్కలకు భారీగా వ్యాపించాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంటలు వ్యాపిస్తుండటంతో డంపింగ్ యార్డు చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు ప్రకటించారు. మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
#WATCH | Massive fire at Turbhe dumping yard in Navi Mumbai; Fire fighting operation underway pic.twitter.com/EHXIbrPiUJ
— ANI (@ANI) February 3, 2023
