Site icon NTV Telugu

New York Explosion: న్యూయార్క్‌లో భారీ పేలుడు.. కమ్మేసిన నల్ల పొగ!

New York Explosion

New York Explosion

New York Explosion: న్యూయార్క్ నగరంలోని అప్‌పర్ ఈస్ట్ సైడ్‌ శుక్రవారం ఉదయం పెద్ద పేలుడు ధాటికి కుదేలైంది. ఈ ఘటనలో మాన్‌హాటన్‌ పక్క ప్రాంతం మొత్తాన్ని దట్టమైన నల్ల పొగ కప్పేసింది. అక్కడి కాలమానం ప్రకారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఈస్ట్ 95వ స్ట్రీట్‌, 2వ అవెన్యూ సమీపంలో భారీ శబ్దంతో పేలుడు చోటుచేసుకుంది. దీని తర్వాత అక్కడే భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

Swiggy: వినియోగదారులకు షాక్ ఇచ్చిన స్విగ్గీ.. భారీగా ప్లాట్‌ఫారమ్ ఫీజు పెంపు!

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం ప్రారంభించాయి. ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడు తీవ్రత కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికులు, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు పరిస్థితిని నియంత్రించడానికి భద్రతా చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Pakistan Helicopter Crash: పాక్‌లో ఘోరం.. వరద సహాయక చర్యల్లో కూలిన హెలికాప్టర్

Exit mobile version