NTV Telugu Site icon

Mumbai Airport: విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, బంగారం, వజ్రాల పట్టివేత

Drugs

Drugs

Mumbai Airport: ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్, బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో 16.49 కోట్ల విలువైన 1700 గ్రాముల కొకైన్‌ను అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌ను స్మగ్లర్ పొట్టలో క్యాప్సూల్స్ రూపంలో దాచిపెట్టినట్లు గుర్తించారు. ముంబాయి ఎయిర్‌పోర్ట్‌లో గ్రీన్ చానెల్ ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించిన ఈ కేటుగాడిని, ట్రావెల్ హిస్టరీ ఆధారంగా అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. అధికారులు స్మగ్లర్‌ను ఆసుపత్రికి తరలించి, వైద్యుల సహాయంతో శస్త్రచికిత్స ద్వారా పొట్టలో దాచిన డ్రగ్స్‌ను వెలికితీశారు. ఈ ఘటన ముంబయిలో డ్రగ్స్ మాఫియా మళ్లీ చురుకుగా ఉందని సూచిస్తోంది. స్మగ్లింగ్‌లో ఎక్కువగా విదేశీయులు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కస్టమ్స్ అధికారులు సదరు వ్యక్తిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read: TPCC Mahesh Goud : తెలంగాణకు న్యాయం జరిగే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తాం

ఇంకొక ప్రధాన కేసులో, కస్టమ్స్ బృందం విమానాశ్రయంలో 55 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు, బంగారం, ఫారిన్ గంజాయిని పట్టుకుంది. జనవరి నెలలోనే కస్టమ్స్ అధికారులు స్మగ్లింగ్‌పై గట్టి నిఘా పెట్టి, ఈ భారీ స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్, ఇథియోపియా, బ్యాంకాక్, దుబాయ్, కెన్యా నుండి ఢిల్లీకి వచ్చిన 8 మంది స్మగ్లర్లను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారు డ్రగ్స్, బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి వినూత్నమైన మార్గాలను అనుసరించారు. బట్టలకు బదులుగా విదేశీ గంజాయిని ప్యాకింగ్ చేసిన స్మగ్లర్, బంగారాన్ని ముద్దగా చేసి ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి, బెల్ట్‌లా తయారు చేసుకొని నడుముకు కట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read: Fridge: బెస్ట్ ఫ్రిడ్జ్ కావాలా?.. బడ్జెట్ ధరలో బ్రాండెడ్ ఫ్రిడ్జ్‌లు ఇవే

ఈ తరహా స్మగ్లింగ్ పెరుగుతున్న నేపథ్యంలో, ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ విభాగం మరింత నిఘా పెంచింది. డ్రగ్స్, బంగారం, వజ్రాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనలు ముంబయి ఎయిర్‌పోర్ట్‌ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి.