NTV Telugu Site icon

Raviteja : మాట ఇచ్చి నిలబెట్టుకున్న రవితేజ..

Whatsapp Image 2024 05 11 At 10.01.43 Am

Whatsapp Image 2024 05 11 At 10.01.43 Am

మాస్ మహారాజ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన రవితేజ ఎంతగానో కష్టపడ్డారు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,విలన్ గా నటిస్తూ హీరోగా మారారు.రవితేజ తన యాక్టింగ్ టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగారు .తన కెరీర్ ఓ ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు .కెరీర్ మొదట్లో ఎంతైతే ఎనర్జీ తో సినిమాలు చేసేవారో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు.అయితే జీవితంలో ఏది కష్టపడకుండా రాదని రవితేజ గట్టిగ నమ్ముతారు. అందుకే టాలెంట్ వున్న యంగ్ హీరోలను ప్రోత్సహిస్తుంటాడు. అదేవిధంగా నూతన దర్శకులకి అవకాశం ఇస్తూ వారి టాలెంట్ నిరూపించుకునేలా ప్రోత్సహిస్తుంటారు.ఇక రవితేజ ఒక్కసారి మాటిస్తే తప్పడని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు.

తాజాగా రవితేజ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బిగ్ బాస్ ద్వారా పేరు పొందిన అమర్‌దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ కి హాజరైన రవితేజ అమర్ కి ఓ మాట ఇచ్చారు.నీకు రవితేజ సినిమాలో అవకాశం కావాలంటే హౌస్ నుంచి బయటికి వచ్చేయ్ అని నాగార్జున అనడంతో వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా పరిగెత్తుకుని బయటకు వచ్చేసాడు. ఆ తరువాత సరదాగా చెప్పాము హౌస్ లోకి తిరిగి వెళ్ళు అని నాగార్జున తెలిపారు.తన కోసం ఇన్నిరోజులు కష్టపడి ఆడిన గేమ్ ను వదిలి వచ్చేయడంతో షాక్ అయిన రవితేజ నీకు నా నెక్స్ట్ మూవీలో తప్పకుండా అవకాశం ఇస్తా అంటూ ఓ మాట ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం రవితేజ్ అమరదీప్ కు అవకాశం ఇచ్చారు.ఈరోజు షూటింగ్లో పాల్గొంటున్నట్టు అమరదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఎట్టకేలకు నా డ్రీం నెరవేరింది అంటూ రవితేజకు అమరదీప్ థాంక్స్ చెప్పాడు .