Site icon NTV Telugu

Tollywood Hero : ప్లాప్ దర్శకులతోనే సినిమాలు చేస్తున్న సీనియర్ హీరో

Mass Jathara

Mass Jathara

ధమాకా తర్వాత హిట్ చూడని మాస్ మహారాజ మరోసారి శ్రీలీలతో కలిసి మ్యాజిక్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అక్టోబర్ 31న మాస్ జాతర రిలీజ్ కాబోతుంది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వరుస ప్లాపుల తర్వాత ఎనర్జటిక్ స్టార్ నుండి వస్తోన్న ఫిల్మ్ కావడంతో ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి. భానుభోగవరపు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌తో హిట్ కొట్టడం మాస్ మహారాజకి నీడ్.

ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన మాస్ జాతర రవితేజ గాయాల కారణంగా వాయిదా పడుతూ ఈ మంత్ ఎండింగ్‌కు రాబోతోంది. ఇదిలా ఉంటే ఏడాదికి ఒకటి రెండు సినిమాలు దించేసే రవితేజ ఈ ఏడాది మాస్ జాతరతో సరిపెట్టేస్తున్నాడు. కానీ నెక్ట్స్ ఇది రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇదే టైంలో ప్లాప్ దర్శకులకు ఛాన్సులిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఆడాళ్లు మీకు జోహార్లు తర్వాత మెగా ఫోన్ పట్టని కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ76 చేస్తున్నాడు. ఫుల్ లెంత్త్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా తెరకెక్కబోతోంది. నెక్ట్స్ ఇయర్ పొంగల్ రేసులో దిగే ఛాన్స్ ఉందని టాక్. రవితేజ 76 లైన్లో ఉంటే మ్యాడ్ స్క్వేర్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఫిల్మ్ ఉండబోతుందని రీసెంట్లీ కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇది సూపర్ హీరో ఫిల్మ్స్‌గా ఉండబోతుందట. ఇవేకాదు మరో ఇద్దరు ప్లాప్ దర్శకులను లైన్లో పెట్టినట్లు సమాచారం. యావరేజ్ మార్కులేయించుకున్న ఖుషీ తర్వాత మెగాఫోన్ టచ్ చేయని శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడని బజ్. ఇదిలా ఉంటే ఆల్ట్రా డిజాస్టర్ ఏజెంట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి మరో ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన కిక్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, కిక్ 2 యావరేజ్. తాజాగా సురేందర్ రెడ్డితో స్టోరీ డిస్కర్షన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version