Mass Jathara: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), క్రేజీ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మాస్ జాతర’. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ తాజాగా మరో పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు చిత్ర బృందం. రొమాంటిక్ బీట్స్‌తో సాగే ఈ పాట “హుడియో.. హుడియో” ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునెలా కనపడుతోంది. ఈ పాటలో శ్రీలీల లంగావోణీలో కనిపించిన విజువల్స్ యూత్‌ను ఆకర్షించేలా ఉన్నాయి. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సంగీతం అందించడమే కాకుండా, స్వయంగా పాట కూడా పాడారు. ఆయనతో పాటు హేషమ్ అబ్దుల్ వహాబ్ వాయిస్ అందించారు. ఈ రొమాంటిక్ పాటకు దేవ్ లిరిక్స్ అందించారు. ఇక ఈ పూర్తి పాటను అక్టోబర్ 8న విడుదల చేయనుంది చిత్ర బృందం.
Bihar Assembly Election 2025 Date: బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. పోలింగ్ తేదీలు ఇవే
భాను బోగవరపు దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే సినిమా నుంచి వరుసగా అప్‌డేట్‌లను విడుదల చేస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు.
American Conspiracy India: హిందువులే టార్గెట్‌గా భారత్‌లో అమెరికన్‌ల భారీ కుట్ర!
