NTV Telugu Site icon

Raviteja 75 : మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్ అప్డేట్..

Raviteja 75

Raviteja 75

Raviteja 75 : మాస్ మహారాజ్ రవితేజ ఈ ఏడాది “ఈగల్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.ఈ సినిమా తరువాత రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మిస్టర్ బచ్చన్”.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు టీజి విశ్వప్రసాద్,వివేక్ కూచిబొట్ల గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also :Kalki 2898 AD : ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. ట్రైలర్ వచ్చేస్తుంది..

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా తరువాత రవితేజ దర్శకుడు అనుదీప్ కేవి తో ఓ సినిమా చేయనున్నాడు.అలాగే సామజవరగమన మూవీ రైటర్ గా  వర్క్ చేసిన భాను బోగవరపుతో రవితేజ ఓ సినిమా చేయనున్నాడు.రవితేజ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా దర్శకుడు భాను బోగవరపు అదిరిపోయే స్టోరీ సిద్ధం చేసినట్లు సమాచారం.ఈ సినిమా షెడ్యూల్ త్వరలోనే మొదలు కానుంది.ఈ సినిమా రవితేజ సినీ కెరీర్ లో 75 వ మూవీగా తెరకెక్కుతుంది.ఇలా వరుస సినిమాలతో రవితేజ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తున్నాడు.

Show comments