Haryana: వామ్మో.. ఎంతగా బరితెగించేశారో..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవలే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పేపర్ లీకేజీలకు సంబంధించి కఠినమైన చట్టాన్ని అమలు చేసింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేశారు. బోర్డు ఎగ్జామ్స్‌లో అక్రమాలకు పాల్పడితే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ కేంద్రం చట్టం తీసుకొచ్చింది. కానీ ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చిన విద్యార్థుల్లోగానీ.. తల్లిదండ్రుల్లో గానీ ఏ మాత్రం భయం కనిపించడం లేదు. తాజాగా హర్యానాలో చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం.
హర్యానాలో ప్రస్తుతం బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. పది, ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే బుధవారం ఓ ఎగ్జామ్ సెంటర్‌లో పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు, బంధువులు పబ్లిక్‌గానే బరితెగించేశారు. పరీక్ష కేంద్రం దగ్గర గోడలు ఎక్కి మరీ విద్యార్థులకు బంధువులు స్లిప్‌లు అందించారు. ఈ ఘటన బుధవారం నుహ్ జిల్లాలోని తౌరులోని చంద్రావతి పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ సెంటర్‌లో పదో తరగతి పరీక్ష జరుగుతుంది.
Also Read
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
- Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు పలువురు చీటిలు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రమాదకర స్థితిలో పాఠశాల గోడలు ఎక్కుతున్నట్లు సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది.
ఇదిలా ఉంటే పరీక్ష ప్రారంభానికి ముందే పేపర్ లీక్ అయిందని తెలుస్తోంది. దీంతో విద్యార్థుల బంధువులు… చీటిలు అందించినట్లు సమాచారం.
ఈ వీడియో కాస్తా విద్యాశాఖ దృష్టికి వెళ్లడంతో తక్షణమే నివేదిక ఇవ్వాలని అధికారులకు జిల్లా విద్యాశాఖ అధికారి పరమజీత్ చాహల్ ఆదేశించారు. కొందరు పిల్లలు పాఠశాల పైకప్పుపైకి ఎక్కినట్లు తాను ఒక వీడియోలో చూసినట్లు ఆయన పేర్కొన్నారు.
भाजपा के शासन में नकल का नज़ारा देखिए!
हरियाणा के नूंह में बोर्ड परीक्षा का ये हाल है, BJP वाले किस मुंह से ढिंढोरा पीटते घूमते हैं! pic.twitter.com/3uRZFEujI0
— Govind Singh Dotasra (@GovindDotasra) March 6, 2024
#WATCH | Nuh, Haryana: On the case of cheating in 10th & 12th Board Exams, District Education Officer Paramjeet Chahal says, "I saw a video and some newspaper cuttings that some children have climbed up the roof of a school. I have asked for a report regarding it…" pic.twitter.com/xwjGmTLNeD
— ANI (@ANI) March 6, 2024
తాజావార్తలు
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
-
Anbe Diana OTT Release: పెద్దలు ఒప్పుకోని ప్రేమ.. తిప్పలు పడే జంట.. ఓటీటీలోకి కడుపుబ్బ నవ్వించే రొమాంటిక్ కామెడీ
-
Suitcase Torso Case: సూట్‌కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
-
Honor Turbo 5G: హానర్ టర్బో 5G విడుదల.. 8,560mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో కొత్త 5G ఫోన్
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!