Site icon NTV Telugu

Maruthi: ‘రాజాసాబ్‌’ ఫ్లాప్‌ కావాలని కొందరు తెగ తాపత్రయపడుతున్నారు: మారుతి షాకింగ్ కామెంట్స్

Maruthi

Maruthi

Maruthi: ఫ్యాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కొత్త సినిమా ‘ది రాజాసాబ్‌’. డైరెక్టర్ మారుతి ఈ సినిమాను హారర్‌ కామెడీగా తెరకెక్కించారు. ఇది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా డైరెక్టర్ మారుతి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆయన చేసిన ఆ షాకింగ్ కామెంట్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Congress: “రాహుల్ గాంధీ శ్రీరాముడట”.. కాంగ్రెస్ నాయకుడి “అతి భజన”పై బీజేపీ ఫైర్..

ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతిని ఇంటర్వ్యూలో భాగంగా.. మీ సినిమా సరిగ్గా ఆడకూడదని, విజయం సాధించకూడదని కొందరు కోరుకుంటున్నారు, నిజానికి వాళ్లు అలా ఎందుకని ఆలోచిస్తున్నారు అనే ప్రశ్నకు బదులిస్తూ.. తాను సక్సెస్ అందుకుంటే మరిన్ని ప్రాజెక్టులతో బిజీగా మారుతానని వాళ్లు అలా అనుకుంటూ ఉండవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈర్ష్య, అసూయ మానవ నైజం అని అన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అనుకుంటారని, నేను సక్సెస్‌తో పై మెట్టు ఎక్కితే వాళ్లకు ఎక్కడ దొరకనేమో అనే భయంతోనే అలా అనుకుంటారని అన్నారు. అయితే తానెప్పుడూ స్టార్‌డమ్‌ శాశ్వతం అనుకోనని వెల్లడించారు. తనకు కథ ముఖ్యం అని, దానికి ఏ హీరో సెట్‌ అవుతారు అనుకుంటే ఆయనతో సినిమా తీస్తానని ‘ది రాజాసాబ్‌’ తర్వాత చిన్న సినిమా తీయాలనుకుంటే తీస్తాను. చాలా కథలు ఉన్నాయి. స్టార్ హీరోతో సినిమా చేశాను అని, అన్నీ అంత భారీ స్థాయిలోనే తీయాలనే ఆలోచనలు, కోరికలు లేవని స్పష్టం చేశారు. కానీ తనకు మాత్రం ఎప్పుడూ పని ఉండాలని మాత్రం కోరుకుంటానని చెప్పారు. రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.

READ ALSO: Vanaveera Review : వనవీర రివ్యూ

Exit mobile version