Site icon NTV Telugu

Maruthi : దర్శకుడు మారుతీ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్…?

Whatsapp Image 2023 07 23 At 10.27.01 Am

Whatsapp Image 2023 07 23 At 10.27.01 Am

తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ వున్న దర్శకుడిగా మారుతి మంచి గుర్తింపు సంపాదించారు.ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో రాజా డీలక్స్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాను అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD వంటి సినిమాలను చేస్తున్నాడు. ప్రభాస్ ఈ రెండు భారీ పాన్ ఇండియా సినిమా షూటింగ్ లలో చాలా బిజీ వున్నాడు. ఆ రెండు సినిమాల షూటింగ్ గ్యాప్ లో తన కాల్ షీట్స్ మారుతి సినిమాకు అడ్జెస్ట్ చేస్తూ వస్తున్నాడు ప్రభాస్.మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ నటించబోయే సినిమా పక్కా కామెడీ ఎంటర్టైనర్ జానర్ ఉండబోతుందంటూ ఓ వార్త బాగా వైరల్ గా మారింది. ఇలా ప్రభాస్ మారుతి డైరెక్షన్లో సినిమా రానున్న నేపథ్యంలో కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతి పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు..

ఈ విధంగా ప్రభాస్ అభిమానులు డైరెక్టర్ మారుతి పై మండి పడటానికి కారణం ఏమిటి అంటే ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కల్కి 2898 AD సినిమా గ్లింప్ వీడియో రీసెంట్ గా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.ఈ వీడియో పై చాలా మంది దర్శకులు స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. అయితే ప్రభాస్ తో సినిమా చేస్తున్న మారుతి మాత్రం ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి స్పందించకపోవడం తో ప్రభాస్ అభిమానులు దర్శకుడు మారుతీ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ తో సినిమా చేయబోయే డైరెక్టర్ కు ప్రభాస్ నటిస్తున్న సినిమాపై స్పందించే సమయం కూడా దొరకలేదా అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు. అయితే దర్శకుడు మారుతీ ప్రభాస్ సినిమాను ప్రమోట్ చేయకుండా బేబీ సినిమాని మాత్రం భారీ స్థాయి లో ప్రమోట్ చేస్తూ ఉండడం పట్ల ప్రభాస్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Exit mobile version