Site icon NTV Telugu

Marriage Dates: జూన్‌, జులైలో పెళ్లికి శుభ ముహూర్తాల తేదీలు ఇవే

Marriage

Marriage

Marriage Dates: మన దేశంలో హిందూ సాంప్రదాయంలో శుభకార్యాలకు ముహూర్తం అనేది ఆచారంగా వస్తుంది. శుభ ముహూర్తాలు లేనిదే హిందూ సాంప్రదాయంలో ఎలాంటి శుభకార్యాలు జరుగవు. అలాగే జ్యోతిష్యం, పంచాంగం ప్రకారమే పెళ్లి వంటి ముఖ్యమైన కార్యాలకు ముహూర్తాలు పెడతారు. కొంత కాలంగా పెళ్లికి సంబంధించి మంచి ముహూర్తాలు లేవు. మూడాలు ఉండటం కారణంగా మార్చి వరకే పురోహితులు పెళ్లి ముహూర్తాలు పెట్టారు. అయితే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో అద్భుతమైన ముహుర్తాలు ఉన్నాయి. అందుకే తల్లిదండ్రులు వారి పిల్లలకు పెళ్లి చేసే యోచనలో ఉంటే ఈ మూహూర్తాలను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు.

Read Also:Road Accident: గుజరాత్‌లో రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ, ముగ్గురు మృతి

జూన్, జులై రెండు నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. జూన్ 29, జూలై 9, 11, 12, 13, 14, 15, తేదీల్లో శుభ ముహుర్తాలు ఉన్నాయని తెలిపారు. అయితే తర్వాత వచ్చే చాతుర్మాసం కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మళ్లీ శుభ ముహూర్తాలు లేవని చెబుతున్నారు. మళ్లీ నవంబరు, డిసెంబర్ నెలలోనే పెళ్లి వంటి శుభకార్యక్రమాలకు ముహూర్తాలు ఉన్నాయట. అందువల్ల మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి చేయాలని భావిస్తే.. ఈ ముహూర్తాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మంచి రోజు ఫిక్స్ చేసుకొని పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు. మళ్లీ ఈ తేదీలు దాటిపోతే మళ్లీ మంచి ముహూర్తం కోసం వేచి చూడాల్సి ఉంటుంది.

Read Also:Suspect Terrorist : భారత్ హెచ్చరిక.. ఐసిస్ హ్యాండ్లర్‌ను అరెస్ట్ చేసిన శ్రీలంక పోలీసులు

శుభ ముహూర్తాలు ఇవే..
జూన్ 29 శనివారం, జులై 9 మంగళవారం, జులై 11 గురువారం, జులై 12 శుక్రవారం, జులై 13 శనివారం, జులై 14 ఆదివారం, జులై 15 సోమవారం

Exit mobile version