Marri Shashidher Reddy: మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నేడు భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయం తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన గురువారమే మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీపై మర్రిశశిధర్‌రెడ్డి చేసిన కామెంట్స్ కాకరేపుతూనే ఉన్నాయి. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ నేతకు మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు ఇవ్వడం వివాదంగా మారుతోంది. వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మాజీ విప్ అనిల్ నోటీసు పంపారు.
Read Also:Yadadri Thermal Power Plant : యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఎంత వరకు సేఫ్ ? అనుమతిపై మరోమారు అధ్యయనం
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్‌కు లేదని మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వల్లే చాలామంది పార్టీ వీడుతున్నారని ఆరోపించారు. రేవంత్ వ్యవహార శైలితో తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోతుందన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందుబాటులో ఉండడన్నారు. శశిధర్‌రెడ్డి చేరికపై బీజేపీ కూడా స్పష్టతను ఇచ్చింది. తెలంగాణ బాగు కోసమే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని.. ఈ విషయం ప్రజల్లో బాగా పాతుకుపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్‌లో ఇప్పుడున్న పరిస్థితిని ఎప్పుడూ ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ పార్టీ విఫలమైందని ఆయన అన్నారు.
