నెల్లూరు జిల్లాలోని గిద్దలూరు నియోజక వర్గంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గడికోట పంచాయతీ దేవనగరం గ్రామంలో ముఖ్య నాయకులతో గ్రామ ప్రజలతో పరిచయ కార్యక్రమంలో మార్కాపురం శాసన సభ్యులు, గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో శాసన సభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. నేను మీ వాడిని మీ అందరి వాడిని మానవత్వం నా కులం, నా మతం, మంచితనం మీరందరికి తెలుసు అని పేర్కొన్నారు.
Read Also: Siddharth Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్ద్.. పెళ్లి కూతురు ఎవరంటే?
ఈ ఒక్క సారి అవకాశం ఇచ్చి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కల్పించమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి కోరారు. గిద్దలూరు నియోజకవర్గంలో నన్ను.. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మమ్ములను భారీ మెజార్టీతో గెలిపించి తద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రెండో సారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం అని ప్రజలకు ఆయన విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.