MLA KP Nagarjuna Reddy: ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువతలో దాగిఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఈ పోటీలు జరుగుతున్నాయి.. ఇక, ఆడుదాం ఆంధ్ర నియోజకవర్గస్థాయి ఆటల పోటీలను ఈ రోజు ప్రారంభించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.. జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్రా పోటీలను మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభం అయ్యాయి.. ఈ పోటీలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు కేపీ నాగార్జున రెడ్డి.. ఆ తర్వాత కాసేపు వాలీబాల్, కబడ్డీ నైపుణ్యంగా ఆడి యువతను ఉత్సాహపరిచారు. ఇక, ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
Read Also: Priyanka Jain: బిగ్ బాస్ కి వెళ్లి తప్పు చేశా.. ఏడుస్తూ సంచలన వీడియో రిలీజ్ చేసిన ప్రియాంక జైన్
వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చెప్పట్టిన ఆడుదాం ఆంధ్ర పోటీలు.. ఇప్పటికే గ్రామ స్థాయి ముగియగా, నేటి నుంచి నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం అయ్యాయి.. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేలు ఈ పోటీల్లో పాల్గొని యువతను ఉత్సాహపరిచారు.. ఇక, మార్కాపురంలో ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి.. ఈ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ అధికారులు, మండల అధికారులు, నియోజకవర్గస్థాయి ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.