Mark Zuckerberg: ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య డాక్టర్ ప్రిసిల్లా చాన్ తమ మూడో బిడ్డను ఈ ప్రపంచంలోకి కలిసి స్వాగతించారు. మార్క్ జుకర్‌బర్గ్ తమ మూడవ కుమార్తె అరేలియా చాన్ జుకర్‌బర్గ్ పుట్టినట్లు ఇన్‌స్టామ్‌గ్రామ్ వేదికగా ప్రకటించారు. “ప్రపంచానికి స్వాగతం, అరేలియా చాన్ జుకర్‌బర్గ్! లిటిల్ బ్లెస్సింగ్” అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. ఒక ఫోటోలో జుకర్‌బర్గ్ మూడో కూతురిని చూసి నవ్వుతూ కనిపించాడు. ఇంటర్నెట్‌లో చాలా మంది వ్యక్తులు ఈ జంటను అభినందించారు.
Read Also: 7th Pay Commission: కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్త.. డీఏ 4 శాతం పెంపు
జుకర్‌బర్గ్ గత ఏడాది సెప్టెంబర్‌లో తన భార్య గర్భం దాల్చిన వార్తను ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్‌లో జుకర్ బర్గ్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. మూడో సారి తండ్రి అవుతున్నానని ఆ శుభవార్తను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తన సతీమణి ప్రిసిల్లా చాన్ మూడోసారి ప్రెగ్నెంట్ అయిందని చెప్పారు. “మ్యాక్స్, ఆగస్ట్‌కు వచ్చే ఏడాది ఓ చెల్లి రాబోతోంది” అని తన భార్యతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. 2012లో ప్రిసిల్లా చాన్‌ను పెళ్లి చేసుకున్నారు జుకర్‌బర్గ్. ఇప్పటికే ఇద్దరి అమ్మాయిలకు జన్మనిచ్చింది ఈ జంట. వాళ్ల పేర్లు మ్యాక్సిమా, ఆగస్ట్. ఇప్పుడు మూడోసారి కూడా కూతురు పుడుతున్నట్టు ప్రకటించారు జుకర్. అమెరికాలో పిల్లలు పుట్టక ముందే లింగనిర్ధరణ చేసుకోవచ్చు. అక్కడ అదేమీ నేరం కాదు. వీళ్లిద్దరూ కాలేజ్‌లో ఉండగానే ప్రేమలో పడ్డారు. హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఓ పార్టీలో ఇద్దరూ కలుసుకున్నారు. 2003 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జంట…2012లో పెళ్లి చేసుకుంది. ఇటీవలే పదో వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపుకున్నారు.