Site icon NTV Telugu

Vijayawada: విజయవాడ బస్టాండ్ లో గంజాయి బ్యాచ్ హల్ చల్

Vijayawada

Vijayawada

గంజాయి, మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అడ్డుకట్టపడడం లేదు. మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయి మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడ బస్టాండ్ లో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. శ్రీశైలం పవర్ ప్లాంట్ లో విధులు నిర్వహిస్తున్న అసిస్టంట్ సెక్రటరీ కృష్ణారావు పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

Also Read:Rajnath Singh: పాక్ వద్ద అణ్వాయుధాలు సురక్షితమా..? అంతర్జాతీయ జోక్యం అవసరం..!

ఈ రోజు ఉదయం శ్రీశైలం నుంచి విజయవాడ విద్యుత్ సౌదా కి విధినిర్వహణ పై వచ్చిన కృష్ణారావు పై పిడిగుద్దులు తో దాడి చేసి పారిపోయింది గంజాయి బ్యాచ్. వారి నుంచి తప్పించుకుని, ప్రాణాలు దక్కించుకుని తన నివాసం అయిన కొండపల్లి చేరుకున్నారు కృష్ణారావు. బస్ దిగి వస్తుండగా సిటీ బస్ టెర్మినల్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు ఇబ్రాహీం పట్నం పోలిసులకు ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.

Exit mobile version