Nobel Peace Prize: రాహుల్ గాంధీ నోబెల్ శాంతి పురస్కారానికి అర్హుడే..? కారణం చెప్పిన కాంగ్రెస్ నేత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nobel Peace Prize: వెనిజులా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో తన దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. ఇటీవలి కాలంలో లాటిన్ అమెరికాలో అసాధారణ ధైర్యసాహసాలకు ఉదాహరణగా మచాదో నిలిచారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. వెనెజ్వెలా ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం మచాదో అవిశ్రాంతంగా పోరాడుతున్నారని కొనియాడింది. వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మడూరో మొరోస్‌కు వ్యతిరేకంగా మచాదో ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. మదురో 12ఏళ్ల పాలనను చాలా దేశాలు చట్టవిరుద్ధమైనదిగా చూస్తాయి.
READ MORE: Prabhas- Amitabh: హ్యాపీ బర్త్ డే బిగ్ బీ.. మీతో కలిసి స్క్రీన్ పంచుకోవడం నాకు దక్కిన గౌరవం
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
అయితే.. తాజాగా కాంగ్రెస్ ప్రతినిధి సురేంద్ర రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. మరియా కొరినా మచాడో, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మధ్య సారూప్యతలను వివరించారు. భారత్‌లో రాజ్యాంగాన్ని కాపాడటానికి పోరాడుతున్న రాహుల్ గాంధీ సైతం ప్రశంసలకు అర్హుడని సూచించారు. “ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని రాజ్యాంగాన్ని పరిరక్షించినందుకు వెనిజులా ప్రతిపక్ష నాయకురాలికి ప్రదానం చేశారు. భారతదేశ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ సైతం దేశ రాజ్యాంగాన్ని కాపాడటానికి పోరాడుతున్నారు.” అని క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. అంతే కాదు.. నోబెల్ గ్రహీత మరియా కొరినా, రాహుల్ గాంధీ ఫొటోలను పక్క పక్కన పెట్టారు.
READ MORE: Prabhas- Amitabh: హ్యాపీ బర్త్ డే బిగ్ బీ.. మీతో కలిసి స్క్రీన్ పంచుకోవడం నాకు దక్కిన గౌరవం
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి నోబెల్ శాంతి బహుమతి నామినేషన్ డిమాండ్ చేయడంపై బీజేపీ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించింది. రాజ్‌పుత్ పోస్ట్‌పై బీజేపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంది. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని బీజేపీ ఆరోపించింది. పోస్ట్‌లో రాహుల్ గాంధీ ప్రస్తావనను వింతగా అభివర్ణిస్తూ.. బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనవాలా మరో పోస్ట్ చేశారు. ” ఈ డిమాండ్ చాలా వింతగా ఉంది. కాంగ్రెస్ రాహుల్ బాబాకు నోబెల్ బహుమతి డిమాండ్ చేస్తోంది. 1) వంచన 2) అబద్ధం 3) 99 సార్లు ఎన్నికల్లో ఓడిపోవడం! 4) 1975 మరియు 1984లో ప్రజాస్వామ్యాన్ని , రాజ్యాంగాన్ని హత్య చేసిన వాళ్లకు బహుమతి ఉద్దేశించినట్లు అయితే.. తప్పకుండా రాహుల్ గాంధీకి వచ్చేది.” అని పేర్కొన్నారు. అంటే ఈ నాలుగు పనులు చేసిన వ్యక్తులకు నోబెల్ శాంతి పురస్కారం ఇస్తామని ప్రకటిస్తే అది రాహుల్ గాంధీకి తప్పకుండా వచ్చేదని అతడి వాదన.
इस बार का नोबल शांति पुरस्कार वेनेजुएला की विपक्ष की नेता को मिला है संविधान की रक्षा करने के लिये।
हिंदुस्तान 🇮🇳 के विपक्ष के नेता श्री राहुल गांधी देश के संविधान को बचाने की लड़ाई लड रहे है । pic.twitter.com/xcgfkJixlZ— Surendra Rajput (@ssrajputINC) October 10, 2025
Bizarre
Congress is demanding Nobel Prize for Rahul BabaHe would get it if there one meant for
1) hypocrisy
2) lying
3) losing elections 99 times !
4) murdering democracy and constitution in 1975 and 1984 pic.twitter.com/21hFknEtcz— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) October 11, 2025
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!