Maria Corina Machado: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2025 నోబెల్ శాంతి బహుమతిని కోల్పోయారు. వాస్తవానికి ట్రంప్‌కు నోబెల్ శాంతి పురస్కారాన్ని కైవసం చేసుకోవాలనే కోరిక చాలా బలంగా ఉంది. కానీ ఆయనను ఈ ఏడాది ఆ బహుమతి వరించలేదు. నోబెల్ శాంతి పురస్కారాన్ని ఈ ఏడాది వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో గెలుచుకున్నట్లు నోబెల్ కమిటి పేర్కొంది. ఇక్కడ విశేషం ఏమిటంటే మరియా తన ఎక్స్ ఖాతా వేదిక కీలక ప్రకటన చేశారు.
READ ALSO: Devi Sri Prasad: పుష్ప 2 దెబ్బకి భయపడుతున్న నిర్మాతలు!
నోబెల్ ట్రంప్‌కు అంకితం చేసిన మరియా..
వెనిజులా నిరంకుశ అధ్యక్షుడు నికోలస్ మదురోను తొలగించడానికి పోరాడుతున్న, వెనిజులా ప్రజల “నిర్ణయాత్మక కారణాన్ని” సమర్థించినందుకు మచాడో అమెరికా అధ్యక్షుడిని ప్రశంసించారు. ” ఈ గుర్తింపు దేశ ప్రజల పోరాటానికి, మన పనిని ముగించడానికి ఒక ప్రోత్సాహకం. మనం విజయపు అంచున ఉన్నాము. నేడు గతం కంటే ఎక్కువగా, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ప్రజలు, లాటిన్ అమెరికా ప్రజలు, ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలను మా ప్రధాన మిత్రులుగా మేము విశ్వసిస్తున్నాము” అని ఆమె తన Xలో పోస్ట్ చేశారు. “ఈ బహుమతిని వెనిజులాలోని బాధల్లో ఉన్న ప్రజలకు, మా లక్ష్యానికి నిర్ణయాత్మక మద్దతు ఇచ్చినందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు అంకితం చేస్తున్నాను!” అని ఆమె పేర్కొన్నారు.
వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన కోసం మచాడో చేసిన అచంచలమైన పోరాటాన్ని నార్వేజియన్ నోబెల్ కమిటీ గుర్తించి ఆమెను నోబెల్ బహుమతి విజేతగా ప్రకటించింది. నోబెల్ శాంతి బహుమతిని మచాడోకు ప్రదానం చేయాలనే నిర్ణయం.. ట్రంప్ నెలల తరబడి చేసిన బహిరంగ ప్రచారాన్ని ధిక్కరిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్న మాజీ అమెరికా అధ్యక్షులు థియోడర్ రూజ్‌వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామాలతో పాటు తన పేరును చెక్కాలని ఆయన సిబ్బందిని ఆశించేవారు. “ఎనిమిది యుద్ధాలను” పరిష్కరించినందుకు తాను నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోవడానికి అర్హుడని పదే పదే ప్రపంచ వేదికలపై ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడి ప్రకటనకు పూర్తి భిన్నంగా పురస్కారం మరియాకు లభించింది.
READ ALSO: Black Coffee Benefits: బ్లాక్ కాఫీ మేజిక్.. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా!
