Maredumilli Fire Accident: మారేడుమిల్లిలో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం, ప్రాణనష్టం!

Maredumilli Fire Accident

Maredumilli Fire Accident

Maredumilli Woods Resorts Fire: పోలవరం జిల్లా మారేడుమిల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ వుడ్స్ రిసార్ట్స్‌లోని వీఐపీ కాటేజీలో మంటలు చెలరేగడంతో చెక్కతో నిర్మించిన సూట్ రూములు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఫర్నిచర్‌తో పాటు ఇతర సామగ్రి అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. అయితే ప్రమాదానికి గంట ముందే పర్యాటకులు సూట్ రూములను ఖాళీ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పర్యాటక ప్రాంతంలో జరిగిన ఈ అగ్నిప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.

మారేడుమిల్లి వుడ్స్ రిసార్ట్స్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. రిసార్ట్‌లోని వీఐపీ కాటేజీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. చెక్కతో నిర్మించిన సూట్ రూములు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో కాటేజీలోని ఫర్నిచర్, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 30 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం జరగడానికి గంట ముందే సూట్ రూముల్లో బస చేసిన పర్యాటకులు ఖాళీ చేయడంతో ప్రాణనష్టం తప్పింది. రిసార్ట్‌లోని ఇతర ప్రాంతాల్లో బస చేస్తున్న పర్యాటకులు మంటలను చూసి భయాందోళనలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న రంపచోడవరం అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే మారేడుమిల్లిలోని ప్రముఖ రిసార్ట్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమా అనే అంశంపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. పర్యాటకుల భద్రత, రిసార్ట్స్‌లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాల అమలుపై ఈ ఘటన మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.