Maoists kill villager: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. కాంకేర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తిని మావోలు చంపేశారు. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. మావోయిస్టులు ‘ప్రజా కోర్టు’ నిర్వహించి మృతుడు పోలీసు ఇన్ఫార్మర్ అని చెప్పి హత్య చేశారని అన్నారు.
READ ALSO: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
ముగ్గురుని తీసుకెళ్లి.. ఒకరిని చంపేశారు..
చోటేబేటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినగుండ గ్రామానికి సోమవారం సాయుధ నక్సలైట్ల బృందం వచ్చింది. గ్రామానికి చెందిన మనీష్ నురేటి, మరో ఇద్దరిని వారితో తీసుకెళ్లారు. అనంతరం వారు నిర్వహించిన ప్రజా కోర్టులో నురేటిని పోలీసు ఇన్ఫార్మర్ అని పేర్కొంటూ, అక్కడికక్కడే చంపేశారు. మిగిలిన ఇద్దరిని చితకబాది వదిలేశారు. అనంతరం మావోలు ఒక పోస్టర్ ఏర్పాటు చేశారు. అందులో మనీష్ నురేటి పోలీస్ ఇన్ఫార్మర్ అని తెలిపారు. ప్రజా కోర్టులో ఆయన శిక్షను ఖరారు చేసి, విధించినట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల చర్యను పోలీసులు తీవ్రంగా తప్పుబట్టారు. చనిపోయిన వ్యక్తి పోలీస్ ఇన్ఫార్మర్ కాదని, అకారణంగా ఒకరిని చంపేశారని అన్నారు.
కాంకేర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఐకె ఎలెసెలా మాట్లాడుతూ.. నురేటి మృతదేహం ఇంకా లభ్యం కాలేదని, అతని కుటుంబ సభ్యులను సంప్రదిస్తున్నామని తెలిపారు. నక్సలైట్లు తరచుగా బినగుండ గ్రామాన్ని సందర్శిస్తారని, గత ఒకటిన్నర సంవత్సరాలలో వాళ్లు పోలీసు ఇన్ఫార్మర్లని ఆరోపించి 4 – 5 వ్యక్తులను చంపారని పేర్కొన్నారు. అయితే మరణించిన వారిలో ఎవరికీ పోలీసులతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి.సుందర్‌రాజ్ ఈ సంఘటనను ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మనీష్ నురేటి పాల్గొంటున్నట్లు కనిపించే ఒక చిన్న వీడియో బయటకి వచ్చిందన్నారు. హత్యపై దర్యాప్తు జరుగుతోందని, దీనిలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
READ ALSO: woman raped by fake baba: దెయ్యం పేరు చెప్పి అత్యాచారం.. దొంగ బాబా అరాచకం
