ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల రాజకీయ వాతావరణం నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బహిరంగ సభలలో రాజకీయ నాయకులు బిజీబిజీగా వారికి ఎలక్షన్ క్యాంపెయిన్ ను నిర్వహిస్తున్నారు. ఇకపోతే మరోవైపు మావోయిస్టుల ప్రాంతాలలో వారి ఉనికిని చాడుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. ఇదివరకే కొన్ని ఏరియాలలో పోలీసులకు మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పులలో చాలామంది మావోయిస్టు మరణించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కొన్నిచోట్ల మావోయిస్టులు వారి కదలికను గుర్తించేలా కొన్ని పోస్టర్స్ ను విడుదల చేస్తున్నారు. ఇక అసలు విషయం చూస్తే..
Also read: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
చత్తీస్గడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా చిందనార్ – తుమ్రిగుండ రహదారిని మావోయిస్టులు తాజాగా దిగ్బంధించారు. ఛింద్నార్ క్యాంపు నుంచి పహుర్నార్ చౌక్, ఛోటే కర్కా, చెర్పాల్, తుమ్రిగుండ వరకు పలు చోట్ల మావోయిస్టులు రాళ్లు, బ్యానర్ పోస్టర్లు వేసి రోడ్డును దిగ్బంధించారు.
Also read: Uma Reddy: మానవత్వం చాటుకున్న సిద్దిపేట ఏఎస్ఐ ఉమా రెడ్డి..
ఇలా రోడ్డుపై రాళ్లు, బ్యానర్ లతో మావోలు దిగ్బంధించడంతో.. బ్యానర్లు, పోస్టర్లు కూడా వేశారు. దీనితో బర్సూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, చిద్నార్ సిఆర్‌పిఎఫ్ భద్రతా బలగాల బృందం రోడ్డును పునరుద్ధరించే పనిని చేపట్టారు. ఇకపోతే ఈ సంఘటన ఎన్కౌంటర్స్ కు నిరసనగా మావోయిస్టులు రోడ్డు దిగ్బంధం చేపట్టారు.