Maoists attack on police at Sukma district: ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా గంగలూరు పీఎస్ పరిధిలోని హిరోలి పోలీస్ క్యాంప్ పై మావోయిస్టుల దాడి చేస్తూ విరుచుకు పడ్డారు. రాకెట్ లాంచర్లతో పోలీస్ క్యాంపును అటాక్ చేసిన మావోయిస్టులుకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. రాకెట్ లాంచర్ల దాడితో పోలీస్ క్యాంప్ లో భారీ నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నా ఇంకా దాడి కొనసాగుతున్న క్రమంలో ఎంత అనేది పూర్తిగా చెప్పలేక పోతున్నారు. ఇక మావోయిస్టుల దాడిని ఎస్పీ ఆంజనేయ వర్షనేయ ధ్రువీకరించారు.
Ramya Raghupathi: మళ్లీ పెళ్లి స్ట్రీమవుతున్న OTTలకు లీగల్ నోటీసులు
అలాగే ఈ దాడుల్లో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు జరుగలేదని మావోయిస్టుల దాడి పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని సుక్మా ఎస్పీ వెల్లడించారు. ఛత్తీస్ గడ్.. మావోయిస్టుల దాడిని భద్రత బలగాలు గట్టిగా తిప్పి కొట్టినట్టు చెబుతున్నారు. హిరోలి క్యాంపు నుంచి 85 బెటాలియన్, కోబ్రా 202 బృందం తనిఖీల కోసం డుమ్రిపాల్నార్‌కు వెళ్లి వస్తుండగా మావోయిస్టులు దాడి చేశారని చెబుతున్నారు. సాయుధ మావోయిస్టులు బీజీఎల్ ఆటోమేటిక్ ఆయుధాలతో తిరిగి వస్తున్న సెక్యూరిటీ పార్టీ మీద కాల్పులు సాగించారని చెబుతున్నారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులతో మావోయిస్టులకు వెన్నులో వణుకు పుట్టి వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. అదే సమయంలో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో భద్రతా బలగాలకు ఎలాంటి నష్టం జరగలేదని చెబుతున్నారు.
Sukma: క్యాంప్ పై మావోయిస్టుల దాడి..పరుగులు పెట్టించిన పోలీసులు!
Show comments