NTV Telugu Site icon

Maoists : మావోయిస్ట్ సభ్యుడితో పాటు ముగ్గురు కొరియర్‌లు అరెస్టు

Maoist

Maoist

భద్రాద్రి కొత్తManipur Clashes : మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్‌గూడెం జిల్లాలోని చెర్ల బస్ స్టేషన్ వద్ద శనివారం సీపీఐ (మావోయిస్ట్) మిలీషియా సభ్యుడితో పాటు ముగ్గురు కొరియర్‌లను అరెస్టు చేశారు పోలీసులు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పక్కా సమాచారం మేరకు చెర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు CRPF 141 బిఎన్‌లు నిర్వహించిన తనిఖీల్లో వారిని అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ వినీత్ జి తెలిపారు.

Also Read :

అరెస్టయిన వ్యక్తులను ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాకు చెందిన పెద్దగెళ్లూరు రివల్యూషనరీ పీపుల్స్ కమిటీ (ఆర్‌పిసి) మిలీషియా సభ్యుడు హేమల భీమా మరియు కొరియర్ పెద్దం కల్లుగా గుర్తించారు. వీరితో పాటు చెర్ల మండలం లెనిన్ కాలనీకి చెందిన కొరియర్లు మడకం దినేష్, తాటి సోను అని పోలీసులు వెల్లడించారు..

Also Read : Manipur Violence: మణిపూర్‌లో హింసాకాండ.. ఇండో-మయన్మార్ సరిహద్దులో వైమానిక నిఘా

వీరు గత రెండేళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారని, మావోయిస్టు జేగురుగొండ ఏరియా కమిటీ సభ్యుడు రతన్‌, పార్టీ 9వ ప్లాటూన్‌ సభ్యురాలు గంగల ఆదేశాల మేరకు పేలుడు పదార్థాలను సేకరించారని ఆరోపించారు. సామాగ్రిని మావోయిస్టులకు అందజేసేందుకు వెళ్తుండగా పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి 44 జిలెటిన్‌ స్టిక్స్‌, 16 మీటర్ల కార్డెక్స్‌ వైర్‌ స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, సీఆర్పీఎఫ్ 141బిఎన్ అదనపు కమాండెంట్ కమల్ వీర్ యాదవ్, చెర్ల సీఐ బి అశోక్ పాల్గొన్నారు.