NTV Telugu Site icon

Maoist Party: ఏజన్సీ ప్రాతంలో టెన్షన్.. టెన్షన్.. నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చిన మావోయిస్ట్ పార్టీ

Maoist Party

Maoist Party

మావోయిస్ట్ పార్టీ నేడు తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. వరుస సంఘటనలతో ములుగు ఏజన్సీ ప్రాతంలో టెన్షషన్ వాతావరణం నెలకొంది. కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలు వాజేడు వెంకటాపురం ఏటూరునాగారం ప్రధాన రహదారులు అడుగు అడుగున తనిఖీలు చేస్తున్నాయి. తెలంగాణ ఛత్తీష్‌గఢ్ సరిహద్దులలో వరుస ఎన్కౌంటర్లతో వాజేడు వెంకటాపురం ఏజెన్సీ వాసులలో ఒక్కసారిగా భయాందోళన ఏర్పడింది. ఎప్పుడు ఎక్కడ ఏ తూటా పేలితుందో తెలియని పరిస్థితి నెలకొంది. భారత్ కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో రాష్ట్ర బంధు కు పిలుపునిచ్చింది.

READ MORE; Bhatti Vikramarka: తెలంగాణ తల్లి విగ్రహం.. మార్చకుండా చట్టం..

డిసెంబర్1వ తేదీన ములుగు జిల్లా చల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్‌లో7 గురు మావోయిస్టులు చనిపోయిన సంఘటన నిరసనగా నేడు.. బంద్‌కు పిలుపు నిచ్చారు. అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పాసవికంగా జరిపిన హత్యాకాండ కు నిరసనగా నేడు రాష్ట్ర బందుకు పిలుపు నిచ్చినట్లు పార్టీ ప్రకటించింది. మావోయిస్ట్ పార్టీ లేఖలో కాంగ్రెస్ పార్టీ అని ప్రస్తావించడం అధికార పార్టీ నాయకుల గుండెలలో గుబులు పుడుతుంది. ఏ వైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో అని భయాందోళన నాయకులు ఉన్నారు. మావోయిస్ట్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. హిట్ లిస్టులో ఉన్న నాయకులని మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లాలని ముందుగానే సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాజేడు వెంకటాపురం రాత్రి వేళలో నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు.

READ MORE; Illegal Sand Mining: రాజమండ్రిలో అక్రమ ఇసుక తవ్వకాలు.. 18 పడవలు సీజ్