Top Maoist Leader Venugopal: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోయారు. మహారాష్ట్ర సీఎం ఫడ్రవీస్ అధికారికంగా ప్రకటించనుంది. కాసేపట్లో గడ్చిరోలి ఎస్పీ ఆఫీసులో సీఎం ఫడ్నవీస్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.. మల్లోజులతో పాటు 61 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఆయుధాలు వీడాలని కొన్ని రోజులుగా మల్లోజుల లేఖలు రాశారు.. 54 ఆయుధాలతో నిన్న గడ్చిరోలి పోలీసుల ముందు లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ రావ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
READ MORE: దీపావళికి ఆఫర్లే.. ఆఫర్లు.. Hyundai, Tata, Maruti Suzuki, Kia కార్లపై ఎంత డిస్కౌంట్ లభించనుందంటే..?
పెద్దపల్లికి చెందిన వేణుగోపాల్ 1978లో ఐటీఐ చేశారు. ఆదిలాబాద్ ప్రజాసంబంధాల విభాగంలో అప్రెంటిస్ షిప్ చేస్తూ.. అన్న కిషన్ పిలుపు మేరకు మావోయిస్టుల్లో చేరారు. దళసభ్యుడిగా చేరిన ఆయన పొలిట్ బ్యూరో స్థాయికి ఎదిగారు. 1981లో పూర్తిస్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్లి ఏటూరునాగారం దళంలో సభ్యుడిగా చేరారు. 1982లో మహదేవపూర్ పోలీసులు వేణుగోపాల్ ను అరెస్ట్ చేయగా ఏడాదికి విడుదలై మళ్లీ అడవిబాట పట్టారు. 1993లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్టడీసీ) కార్యదర్శిగా పని చేశారు. 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2007లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగారు. సెంట్రల్ రీజనల్ బ్యూరో కార్యదర్శిగా ఉంటూనే జనతన సర్కార్ కు మార్గదర్శకత్వం వహించారు. పార్టీలో అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో వ్యవహరించారు. ఆయనపై రూ.6 కోట్ల రివార్డు ఉంది. మే 21న పార్టీ చీఫ్ బస్వరాజ్ మృతి తర్వాత ఆ స్థానం కోసం అభయ్.. తిప్పిరి తిరుపతి తెరపైకి వచ్చాయి. విభేదాలకు తోడు.. అనారోగ్యం, పోలీసుల ముట్టడి తీవ్రం అవడంతో లొంగుబాటు పట్టారు.
READ MORE: Hrithik Roshan : హైకోర్ట్‌ను ఆశ్రయించిన హృతిక్ రోషన్..
