Site icon NTV Telugu

Maoist Party: “అందరం ఒకేసారి”..! ఆయుధ విరమణపై తేదీ ప్రకటించిన మావోయిస్టు పార్టీ..

Maoists2

Maoists2

Maoist Party: మావోయిస్టు ఉద్యమంలో కీలకమైన మార్పుకు సూచించే ప్రకటన వెలువడింది. ఎంఎంసి జోన్ ప్రతినిధి అనంత్‌ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో జనవరి 1 నుంచి సాయుధ కాల్పుల విరమణకు సిద్ధమయ్యామని మావోయిస్టు పార్టీ వెల్లడించింది. ఎవరికి వారు వ్యక్తిగతంగా లొంగిపోయే బదులు సమూహంగా ముందుకు రావడానికి సిద్ధమయ్యాం అని ప్రకటనలో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

READ MORE: Micro-Robots: బ్రెయిన్ స్ట్రోక్ తో పోరాడేందుకు సిద్ధమవుతున్న మైక్రో రోబోట్స్

ప్రకటనలో ప్రభుత్వం చేపట్టిన ‘పూనా మార్గెం’ ప్రచారాన్ని అంగీకరిస్తున్నామని, శాంతి చర్చలకు అనుకూలంగా ముందుకు సాగడానికి సిద్ధమని తెలిపారు. పరస్పర సమన్వయం, కమ్యూనికేషన్‌ కోసం ఒక ఓపెన్‌ ఫ్రీక్వెన్సీ నంబర్‌‌ను కూడా విడుదల చేశారు. తమ సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, చర్చల కోసం ముందుకు రావడంలో ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించారు. అయుధాలు వదులుకోవడం ప్రజలకు ద్రోహం చేయడం కాదని పేర్కొన్నారు. ఇది సంఘర్షణకు సరైన సమయం కాదు.. ఆయుధాలు ఒక ముగింపు, ఒక మార్గం కాదు.. కానీ సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి తీసుకునే నిర్ణయమని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రకటననపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అన్న ఆసక్తి పెరిగింది. శాంతి చర్చలకు కొత్త మార్గం తెరుచుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

READ MORE: Tollywood : టాలీవుడ్ స్టార్ హీరోల లైనప్.. ఎవరెవరి చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే

Exit mobile version