విమాన ప్రయాణం కేవలం సౌకర్యంగా మాత్రమే కాకుండా ఖరీదైన అవసరంగా మారింది. విమానయాన సంస్థలు ఇప్పుడు సీట్ల ఎంపిక, లగేజ్ చెక్-ఇన్, భోజనం వంటి సేవలకు అదనంగా వసూలు చేస్తున్నాయి. గత దశాబ్దంలో విమానయాన పరిశ్రమలో చాలా మార్పు వచ్చింది. గతంలో విమాన ప్రయాణం ఒక విలాసవంతమైనదిగా భావించేవారు. కానీ, ఇప్పుడు అది ఒక అవసరంగా మారింది. పేద, ధనిక తేడా లేకుండా అందరు ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు. ప్రయాణీకుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కానీ విమానయాన సంస్థల లాభాలు తగ్గుతున్నాయి.పెరుగుతున్న ఖర్చుల కారణంగా విమానయాన సంస్థలు వివిధ సేవలకు ప్రయాణీకుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారు.
Also Read:Kalyan Ram : ఆమెను నేను అమ్మ అనే పిలుస్తా
గతంలో బేస్ ఫేర్‌లో చేర్చబడిన సౌకర్యాలకు ఇప్పుడు విడిగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ ప్రక్రియను ‘నికెల్ అండ్ డైమ్’ అని పిలుస్తారు. దీనిలో చిన్న వస్తువులకు ఫీజు వసూలు చేస్తారు. విమానయాన సంస్థలు ఇప్పుడు ప్రయాణీకుల నుంచి సీటు ఎంచుకోవడానికి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయి. గతంలో, విమాన ప్రయాణంలో ఆహారం ఉచితంగా ఉండేది. కానీ ఇప్పుడు సుదూర విమానాలలో కూడా ఫుడ్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. నిర్దేశించిన పరిమితిని మించిన సామానుపై ఛార్జీ విధించబడుతుంది. ఇప్పుడు లగేజ్ చెక్-ఇన్ కూడా ఉచితం కాదు. అంతేకాకుండా, అనేక విమానయాన సంస్థలు తమ లాయల్టీ కార్యక్రమాల కింద బిజినెస్ క్లాస్ ప్రయాణీకులకు కొన్ని ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. అయితే ఎకానమీ క్లాస్ ప్రయాణీకులు ప్రతి చిన్న సర్వీస్ కు విడిగా చెల్లించాల్సి వస్తోంది.
Also Read:Cm Chandrababu : రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్
వేసవి సెలవుల్లో ఛార్జీలు పెంచడానికి సన్నాహాలు
అమెరికాలోని అనేక విమానయాన సంస్థలు వేసవి సెలవుల్లో విమానాల సంఖ్యను పెంచే బదులు తగ్గించాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయంతో నడిచే విమానాలు ఖరీదైనవిగా, ప్రయాణీకులతో రద్దీగా ఉంటాయి. వేసవి సేలవుల్లో ప్రయాణీకులు ప్రయాణించాల్సి వస్తే.. బుకింగ్ కోసం తక్కువ ఫ్లైట్స్ ఉన్నందున విమానయాన సంస్థలు అధిక ఛార్జీలను వసూలు చేస్తాయి. అదనంగా, అనేక ఉచిత సేవలు కూడా పరిమితం చేస్తున్నారు.
Also Read:10TH Exams : రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ ఎగ్జామ్స్..
ఇప్పటివరకు ఉచిత బ్యాగ్ చెక్-ఇన్‌ను అందించిన బడ్జెట్ ఎయిర్‌లైన్ సౌత్‌వెస్ట్, దానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మే నెలాఖరు నుంచి ఈ సౌకర్యం ‘ఎ-లిస్ట్’ లాయల్టీ ప్రోగ్రామ్ సభ్యులు, బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు, బిజినెస్ క్లాస్ ప్రయాణీకులకు మాత్రమే పరిమితం చేయబడుతుంది. కోవిడ్-19 కాలంలో ప్రయాణీకుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు విమానయాన సంస్థలు అనేక ఉచితాలను అందించాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గతంలో ఛార్జీలలో భాగంగా ఉన్న అన్ని ఫీజులను ఇప్పుడు విమానయాన సంస్థలు వసూలు చేస్తున్నాయి.