Site icon NTV Telugu

Neeraj Chopra-Manu Bhaker: నీరజ్‌ చోప్రాకు గాయం.. మను బాకర్‌ పోస్ట్ వైరల్‌! ఏంటి సంగతి మను

Neeraj Chopra, Manu Bhaker

Neeraj Chopra, Manu Bhaker

డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్‌ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. ఈ పోటీ సమయంలో నీరజ్‌ ఎడమచేతి వేలు విరిగింది. గాయంతో బాధపడుతూనే పోటీలో పాల్గొన్న అతడు మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ ఏడాదిలో ఇదే చివరి పోటీ అని, 2025లో కలుద్దాం అంటూ ఫైనల్ అనంతరం ఎక్స్‌లో నీరజ్‌ పోస్ట్ చేశాడు. ఈ పోస్టుపై భారత స్టార్‌ షూటర్‌ మను బాకర్‌ స్పందించారు. నీరజ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

‘ఈ ఏడాదిలో ఇదే చివరి పోటీ. ట్రాక్‌పై నిలబడే ఈ సీజన్‌ను ముగించాలనుకున్నా. నా సొంత అంచనాలను అందుకోలేకపోయా. కానీ ఈ సీజన్‌లో ఎంతో నేర్చుకున్నా. పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి కొత్త సీజన్‌లో అడుగుపెడుతా. నన్ను మరింత మెరుగైన అథ్లెట్‌గా, వ్యక్తిగా 2024 మార్చింది. 2025లో మళ్లీ కలుద్దాం’ అని నీరజ్‌ చోప్రా ఎక్స్‌లో పేర్కొన్నాడు. ‘2024ను అద్భుతంగా ముగించిన నీరజ్‌ చోప్రాకు అభినందనలు. నువ్వు త్వరగా కోలుకోవాలి. రానున్న ఏళ్లలో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నా’ అని మను బాకర్‌ మను బాకర్‌ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ కాగా.. ‘ఏంటి మను.. ఏంటి సంగతి’ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: IND vs BAN: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. జాగ్రత్త సుమీ! వీళ్లతోనే ముప్పు

పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో నీరజ్‌ చోప్రా, మను బాకర్‌లు దేశానికి మెడల్స్ సాధించారు. సంబంధించిన ఇటీవల ఓ వార్త వైరల్‌గా మారింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లలో మను రెండు కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. మరోవైపు జావెలిన్ త్రోయర్‌ నీరజ్‌ రజత పతకం సాధించాడు. ఇటీవల ఈ ఇద్దరికి సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. ఒలింపిక్స్‌ సమయంలో సన్నిహితంగా మెలగడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అలాంటిదేమీ లేదని మను క్లారిటీ ఇచ్చారు.

Exit mobile version