NTV Telugu Site icon

Paris Olympics 2024: మరో పతకానికి చేరువలో మను భాకర్..

Manu Bhakar

Manu Bhakar

భారత స్టార్ షూటర్ మను భాకర్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తుంది. శుక్రవారం మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించింది. మను క్వాలిఫికేషన్ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచింది. మరో భారత క్రీడాకారిణి ఇషా సింగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఇషా క్వాలిఫికేషన్‌లో 18వ స్థానంలో నిలిచింది.

Shivraj Chouhan: మేము “కృ‌ష్ణుడిని” గుర్తుంచుకుంటే, రాహుల్ గాంధీ “శకుని” గురించి ఆలోచిస్తున్నాడు..

మను వరుసగా మూడో ఈవెంట్ ఫైనల్‌లో..
మను భాకర్.. వరుసగా మూడో ఈవెంట్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అంతకుముందు.. మను భాకర్, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి ఫైనల్స్‌కు చేరుకుంది. రెండింటిలోనూ కాంస్య పతకం సాధించింది. కాగా.. తాజాగా 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్కు చేరింది. ఈ క్రమంలో మను హ్యాట్రిక్ పతకాలు సాధించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఒక ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలు మను భాకర్. మను రేపు (శనివారం) 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుంది.

మను భాకర్ ప్రెసిషన్ రౌండ్‌లో 294.. ర్యాపిడ్ రౌండ్‌లో 296 పరుగులు చేసింది. మొత్తం స్కోరు 590 చేసింది. హంగరీకి చెందిన మేజర్ వెరోనికా మొదటి స్థానంలో నిలిచింది. ఆమె ప్రెసిషన్ రౌండ్‌లో 294, ర్యాపిడ్ రౌండ్‌లో 298 పరుగులు చేసింది. వెరోనికా మొత్తం స్కోరు 592. ప్రీ సీజన్ రౌండ్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఫ్రాన్స్‌కు చెందిన వెరోనికా.. కెమిల్లె జెడ్రెజెవ్స్కీలు కూడా మను మాదిరిగానే 294 పాయింట్లు సాధించారు. అయితే ఇద్దరూ X (లక్ష్యం మధ్యలో) ఎక్కువ కొట్టడం ద్వారా మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు.