NTV Telugu Site icon

Manu Bhaker: భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించాలి..

Manu Bhakar

Manu Bhakar

పారిస్ ఒలింపిక్స్ 2024లో దేశ పతాకధారిగా నిలవడం గర్వించదగ్గ విషయమని పిస్టల్ షూటర్ మను భాకర్ అన్నారు. పారిస్‌లో రెండు పతకాలు సాధించిన భారత పిస్టల్ షూటర్ మను భాకర్ ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలపై కన్నేసింది. పతకాలు సాధించేందుకు తాను ఎంతో కష్టపడ్డానని చెప్పారు. భవిష్యత్తులో తాను ఒకే ఒలింపిక్స్‌లో రెండు కంటే ఎక్కువ పతకాలు సాధించగలిగితే అది గొప్ప అని పేర్కొన్నారు. కష్టపడి పనిచేస్తే.. భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రదర్శన చూపించగలం.. తద్వారా భవిష్యత్తులో భారత్‌కు మరిన్ని ఒలింపిక్ పతకాలు సాధించాలని కోరుకుంటున్నానని మను భాకర్ చెప్పారు.

Sobhita : ఆమె కుక్కగా పుట్టినా పర్లేదు… సమంతపై శోభిత పాత పోస్ట్ వైరల్!

22 ఏళ్ల మను ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. ఆమె మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత.. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాలను సాధించింది. ఆమె 25 మీటర్ల పిస్టల్‌లో స్వల్ప తేడాతో కాంస్యం గెలుచుకోలేకపోయింది. కాగా.. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలో వెటరన్ హాకీ గోల్ కీపర్ పిఆర్ శ్రీజేష్‌తో కలిసి మను భారతదేశ పతాకధారిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మను భాకర్ మాట్లాడుతూ.. “ఇది జీవితంలో ఒకసారి జరిగే అనుభవం” అని చెప్పింది. దీనిని తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపింది. శ్రీజేష్ భయ్యాతో తనకు చాలా మంచి అనుబంధం ఉందని.. ఆయన తనకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు.. అతను చాలా స్నేహపూర్వకంగా, సహాయకారిగా.. మర్యాదగా ఉంటాడని పేర్కొంది. అలాగే పారిస్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో శ్రీజేష్ తనకు మంచి సపోర్ట్ అందించాడని చెప్పుకొచ్చింది.

Iran-Israel Tensions: ఇజ్రాయిల్‌పై ఈ వారమే ఇరాన్ దాడి చేయొచ్చు.. యూఎస్ బిగ్ వార్నింగ్..

ఇదిలా ఉంటే.. మను భాకర్ మూడు నెలల విరామం తీసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో ఆమె అక్టోబర్‌లో జరగనున్న ప్రపంచకప్‌కు దూరంగా ఉంటుంది. ఆమె కోచ్ జస్పాల్ రాణా మాట్లాడుతూ.. ఆమె మూడు నెలల విరామం తీసుకుంటున్నందున అక్టోబర్‌లో జరిగే ప్రపంచకప్‌లో ఆడే అవకాశం లేదన్నారు. ఆమె చాలా కాలంగా కష్టపడుతోంది కాబట్టి ఇది సాధారణ విరామం అని అన్నారు. కాగా.. అక్టోబర్ 13 నుంచి 18 వరకు ఢిల్లీలో షూటింగ్ ప్రపంచకప్ జరగనుంది. అయితే.. 2026లో జరిగే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటుందని జస్పాల్ తెలిపారు.