పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతక ఖాతా తెరిచింది. షూటింగ్‌లో భారత షూటర్ మను భాకర్ కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళా షూటర్‌గా నిలిచింది. ఫైనల్లో మను మొత్తం 221.7 పాయింట్లు సాధించింది. ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. షూటర్ మను భాకర్‌కు అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ ఆమెకు అభినందనలు తెలిపారు.
మను భాకర్ ను చూసి భారత్ గర్విస్తోంది: రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము మను భాకర్‌ను అభినందించారు. “పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్‌లో కాంస్య పతకంతో భారత్‌కు పతక ఖాతా తెరిచినందుకు మను భాకర్‌కు హృదయపూర్వక అభినందనలు. షూటింగ్ పోటీల్లో ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళ. మను భాకర్ ను చూసి నేడు భారతదేశం గర్విస్తోంది. ఆమె ఫీట్ చాలా మంది ఆటగాళ్లకు, ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తినిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.” అని ద్రౌపది ముర్ము తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
READ MORE: Paris Olympics 2024: మహిళల 50 కేజీల విభాగంలో ప్రీ-క్వార్టర్‌ఫైనల్స్కు నిఖత్..
ఈ విజయం చరిత్రాత్మకం: మోడీ
అదే సమయంలో ప్రధాని మోడీ ఆమెకు అభినందనలు తెలిపారు. ” ఇది ఒక చరిత్రాత్మక పతకం. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని (కాంస్య పతకం) అందించినందుకు మను భాకర్‌కు అభినందనలు. భారత్ తరఫున షూటింగ్‌లో పతకం గెలిచిన తొలి మహిళగా రికార్డులకెక్కడంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా మారింది. ఇది అపురూపమైన విజయం.” అని మోడీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
READ MORE:Manu Bhaker: 16 ఏళ్ల వయసులోనే మను భాకర్ కు అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణం..
తొలి పతకం సాధించడం చూసి గర్వపడుతున్నా: రాహుల్ గాంధీ
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా మను భాకర్‌ను అభినందించారు. అతను ఎక్స్ పోస్ట్‌లో ఇలా వ్రాశాడు, ‘పారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024లో భారతదేశం తన మొదటి పతకాన్ని గెలుచుకోవడం గర్వంగా ఉంది. ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళా షూటర్ – కాంస్యం పతకం సాధించిన మను భాకర్‌కు అభినందనలు. మా కుమార్తెలు మాకు గొప్ప ప్రారంభాన్ని అందించారు. మరిన్ని పతకాలు రావాల్సి ఉంది.” అని రాసుకొచ్చారు.
READ MORE:RAU’S IAS Study Circle : రౌస్ స్టడీ సెంటర్‌లో మంచిర్యాలకు చెందిన విద్యార్థిని మృతి
భారత క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్ గౌతం గంభీర్ కూడా మను భాకర్‌ను అభినందించారు . ఆయన ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. ‘భారత్‌కు తొలి పతకం సాధించినందుకు మను భాకర్‌కు అభినందనలు. మీరు దేశం గర్వించేలా చేశారు.” అని తెలిపారు.