Manoj Tiwari: ఏకంగా బీజేపీ ఎంపీ ఇంటికే కన్నం.. ఎంత డబ్బు ఎత్తుకెళ్లారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MP Manoj Tiwari’s Mumbai Home Theft: బీజేపీ నేత, ఢిల్లీ ఈశాన్య లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ, ప్రముఖ గాయకుడు మనోజ్ తివారీ ముంబై ఇంట్లో జరిగిన చోరీ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంధేరీ వెస్ట్‌లోని శాస్త్రి నగర్ ప్రాంతంలో ఉన్న సుందర్బన్ అపార్ట్మెంట్లో ఈ సంఘటన జరిగింది. మొత్తం 5.40 లక్షల రూపాయల నగదు చోరీ జరిగినట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చోరీ చేసిన దొంగ ఎవరో బయట వ్యక్తి కాదు. మనోజ్ తివారీ ఇంట్లో గతంలో పనిచేసిన ఒక ఉద్యోగి అని తేలింది. మనోజ్ తివారీకి గత 20 ఏళ్లుగా మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రమోద్ జోగిందర్ పాండే అంబోలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
READ MORE: Nora Fatehi : పాత గాసిప్స్ మళ్ళీ తెరపైకి తెచ్చి నోరా..
Also Read
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడి పేరు సురేంద్రకుమార్ దీనానాథ్ శర్మ. ఇతడిని సుమారు రెండు సంవత్సరాల క్రితమే ఉద్యోగం నుంచి తొలగించారు. కానీ ఇంటికి సంబంధించిన డూప్లికేట్ తాళాలు అతని వద్ద ఉండటంతో అదే అవకాశంగా తీసుకుని చోరీలకు పాల్పడ్డాడు. ఈ చోరీ ఒక్కరోజులో జరగలేదని పోలీసుల విచారణలో బయటపడింది. జూన్ 2025లోనే బెడ్రూమ్లోని ఒక అల్మారాలో నుంచి 4.40 లక్షల రూపాయలు మాయమయ్యాయి. అప్పట్లో ఎవరు దొంగతనం చేశారో తెలియలేదు. అనుమానం రావడంతో డిసెంబర్ 2025లో ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో అసలు నిజం బయటపడింది. 2026 జనవరి 15 రాత్రి 9 గంటల సమయంలో సీసీటీవీ అలర్ట్ వచ్చింది. ఫుటేజ్ చూసినప్పుడు.. మాజీ ఉద్యోగి సురేంద్రకుమార్ ఇంట్లోకి వచ్చి చోరీ చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. సీసీటీవీ ఆధారాలతో నిందితుడిని విచారించగా, అతడు తన తప్పును ఒప్పుకున్నాడు. వెంటనే అంబోలి పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!