Maratha Reservation: ‘మేము గెలిచాము’.. నిరాహార దీక్షను విరమించిన మరాఠా నాయకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maratha Reservation: మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన మరాఠాలకు ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మనోజ్ జరంగే పాటిల్ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రాథమిక డిమాండ్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పాటు రిజర్వేషన్ల డిమాండ్‌తో నిరసన తెలుపుతున్న వారిపై దాఖలైన అన్ని కేసులను ఉపసంహరించుకోవడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. క్యాబినెట్ సబ్-కమిటీతో సమావేశం తర్వాత, ప్రభుత్వం తీర్మానం జారీ చేసిన అనంతరం.. తన మద్దతుదారులు రాత్రి 9 గంటలకు ముంబైని ఖాళీ చేస్తారని పాటిల్ ప్రకటన విడుదల చేశారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత “మేము గెలిచాము” అని చెబుతూ ఆయన తన 5 రోజుల నిరాహార దీక్షను ముగించారు. మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ విఖేపాటిల్ ఆయనతో నిరాహార దీక్షను విరమింపజేశారు.
READ ALSO: Udayabhanu: బాలయ్య చూపించే ప్రేమ, నా ఫ్యామిలీ దగ్గర నుంచి కుడా దొరకలేదు
Also Read
- Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
- IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
- Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
పాటిల్‌ను కలిసిన మంత్రివర్గ ఉపసంఘం
ఇప్పటి వరకు మహారాష్ట్రలో కున్బీ సమాజం OBC వర్గం కింద రిజర్వేషన్‌లను పొందుతోంది. మరాఠా రిజర్వేషన్ సమస్యకు హైదరాబాద్ గెజిట్ సంబంధం ఏంటంటే.. ప్రస్తుత మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతం ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లోని నిరసన స్థలంలో మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం పాటిల్‌ను కలిసింది. మంత్రులు రాధాకృష్ణ విఖే పాటిల్, మాణిక్‌రావు కోకాటే, శివేంద్ర రాజే భోసలే ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పాటిల్ మాట్లాడుతూ.. మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌ను నెరవేర్చడానికి హైదరాబాద్ గెజిట్‌ను అమలు చేయడానికి క్యాబినెట్ సబ్-కమిటీ అంగీకరించిందని చెప్పారు. మంత్రులతో సమావేశం తర్వాత ఆయన తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీ బలంతో మనం గెలిచాము, ఈ రోజు నేను పేదల శక్తిని అర్థం చేసుకున్నాను” అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ స్పందనతో తాము సంతోషంగా లేమని బాంబే హైకోర్టు పేర్కొంది. ఆజాద్ మైదాన్‌లో ఆందోళన కొనసాగించాలన్న తన అభ్యర్థనను ముంబై పోలీసులు తిరస్కరించడంతో పాటిల్ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్, న్యాయమూర్తి ఆర్తి సాథేలతో కూడిన ధర్మాసనం పాటిల్ న్యాయవాదితో మాట్లాడుతూ.. మధ్యాహ్నం 3 గంటలలోపు వీధుల్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించకపోతే, న్యాయమూర్తులు వీధుల్లోకి వస్తారని చెప్పారు. తమ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మరాఠా నాయకుడిని హెచ్చరించారు. ముంబైలోని ఆజాద్ మైదాన్ సమీపంలో వేలాది మంది మరాఠా మద్దతుదారులు సాధారణ ప్రజల జీవితానికి తీవ్ర అంతరాయం కలిగించిన నేపథ్యంలో బెంచ్ ఈవిధంగా స్పందించింది. విచారణ సందర్భంగా నిరసనల వల్ల కలిగిన అసౌకర్యానికి పాటిల్ న్యాయవాది సతీష్ మాన్షిండే పాటిల్ క్షమాపణలు చెప్పారు. 5000 మందితో కూడిన సమావేశానికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పుడు, నిరసనలకు అంత మంది ఎందుకు వచ్చారని కోర్టు పాటిల్‌ను ప్రశ్నించింది. “60,000 మందికి పైగా ప్రజలు నగరంలోకి వచ్చారని మీకు తెలిసినప్పుడు, మీరు ఏ చర్యలు తీసుకున్నారు?” అని ధర్మాసనం ప్రశ్నించింది, బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తుందని పేర్కొంది.
READ ALSO: Konaseema : అప్పనపల్లిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ వివాదం.. కోనసీమలో రాజకీయ వేడి
తాజావార్తలు
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్‌లో సూర్య..
-
Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
-
IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!