NTV Telugu Site icon

Haryana: హర్యానా సీఎం రాజీనామా.. కారణం అదే..?

Katter

Katter

Manohar Lal Khattar: లోక్‌సభ ఎన్నికల ముందు హర్యానా రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ (BJP), జననాయక్ జనతా పార్టీ (JJP) కూటమి బంధం తెగిపోయింది. హర్యానాలో లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకంపై బీజేపీ- జేజేపీ కూటమిలో విభేదాలు వచ్చిన.. నేపథ్యంలో సీఎం (Haryana CM) పదవికి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ (Manohar Lal Khattar) ఇవాళ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు ఆయన సమర్పించారు. మంత్రి మండలి సభ్యులు కూడా తమ రాజీనామాలను గవర్నర్ కు అందించారు.

Read Also: Hardik Pandya: హార్దిక్‌ పాండ్యా లేకున్నా.. గుజరాత్ టైటాన్స్‌ పటిష్టంగానే ఉంది!

ఇక, తాజా పరిణామాలతో బీజేపీ ( BJP) హర్యానా రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 90 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటకు 46 మంది ఎమ్మెల్యేలు అవసరం.. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి మెజారిటీ తక్కువ రావడంతో బీజేపీ, జేజేపీ (JJP) కూటమిగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారు. అయితే, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌ ( Congress ) పార్టీకి 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

Read Also: Animal టీవీలోకి వచ్చేస్తున్న యానిమల్ మూవీ..టెలికాస్ట్ ఎప్పుడంటే..?

అయితే, ఈ తరుణంలో స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ సొతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ రోజే కొత్త ముఖ్యమంత్రిని కమలం నేతలు ఎన్నుకోనున్నట్లు తెలుస్తుంది. కాసేపట్లో బీజేపీఎల్పీ సమావేశం కాబోతుంది. ఈ భేటీ తర్వాత తదుపరి సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేసులో నయబ్‌సైనీ ఉన్నట్లు టాక్.