NTV Telugu Site icon

Lok Sabha Elections 2024: ఇంటి నుంచే ఓటేసిన మన్మోహన్ సింగ్, హమీద్ అన్సారీ

Manmohan Singh, Hamid Ansar

Manmohan Singh, Hamid Ansar

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నాలుగు దశల పోలింగ్‌ పూర్తి కాగా.. మిగిలిన మూడు దశల ఓటింగ్‌కు సంబంధించిన ప్రచారం జోరుగా సాగుతోంది. మే 25న ఢిల్లీలో ఆరో దశ పోలింగ్‌ జరగనుంది. ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఢిల్లీలోని ఎన్నికల సంఘం 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే విధానాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా, శుక్రవారం మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆయన భార్య గురుశరణ్ కౌర్ న్యూఢిల్లీ లోక్‌సభ స్థానానికి తమ ఇంటి నుంచే ఓటు వేశారు.

READ MORE: Uttarakhand : ఇంటి బయట ఆడుకుంటుండగా పిల్లాడిని ఎత్తుకెళ్లిన చిరుత

జిల్లా ఎన్నికల కార్యాలయ అధికారులు ఆయన ఇంటికి వెళ్లి ఓటింగ్ నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఇంటికి కూడా ఎన్నికల అధికారులు చేరుకున్నారు. అతనూ ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ ప్రధాన ఎన్నికల కార్యాలయం (CEO) 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల (PWD) కోసం హోమ్ ఓటింగ్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఈ సదుపాయం మే 24 వరకు కొనసాగుతుంది.

ఢిల్లీలో 5,472 మంది వృద్ధులు, దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. వారు ఇంటి నుంచే ఓటేసేందుకు ఫారం 12Dని నింపారు. ఢిల్లీ ఎన్నికల సంఘం సీఈఓ కూడా ఇంటి వద్దే ఓటు వేయాలనుకునే ఓటర్ల కోసం సన్నాహాలు చేశారు. ఇంటి నుంచి ఓటు వేసే ప్రక్రియలో ఓటింగ్ సమయంలో అత్యంత గోప్యత, సమగ్రతను కాపాడేందుకు పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది వారి వెంట ఉంటారు. శారీరక పరిమితులు లేదా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడి స్వరం లెక్కించబడే న్యాయమైన ప్రజాస్వామ్యాన్ని నిర్ధారిస్తామని ఎన్నికల సంఘం (ECI) హామీ ఇస్తుంది. ఇంటికి వెళ్లేముందు వారి చరవాణులకు షెడ్యూల్ మెసేజ్ రూపంలో పంపుతారు. మొత్తం ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి, ప్రతిదీ వీడియోగ్రాఫ్ చేయబడుతుంది.