Site icon NTV Telugu

Rajya sabha: ముగిసిన 54 మంది సభ్యుల పదవీకాలం.. ఎవరెవరంటే!

Soniya

Soniya

దేశ వ్యాప్తంగా రాజ్యసభ సభ్యులుగా ఉన్న పలువురి పదవీకాలం మంగళవారం, బుధవారంతో ముగియనుంది. మొత్తం 54 మంది సభ్యుల పదవీ కాలం ముగిసింది. ఇక 33 ఏళ్ల తర్వాత రాజ్యసభ నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రిటైర్ అవుతున్నారు. దీంతో మన్మోహన్ స్థానంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభకు ఎంట్రీ ఇస్తున్నారు. మన్మోహన్ అవుట్ అవుతుంటే.. సోనియా ఇన్ అవుతున్నారు. బుధవారంతో మన్మోహన్ పదవీకాలం ముగియడంతో.. సోనియా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్యసభ చైర్మన్.. సోనియాచే బుధవారం ప్రమాణం చేయించనున్నారు. బుధవారం ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు 10 మంది కొత్త సభ్యులతో రాజ్యసభ ఛైర్మన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక గురువారం మరికొంత మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేస్తారు.

ఇది కూడా చదవండి: Chandrababu: పెన్షన్ల అంశంపై టీడీపీ అధినేత బహిరంగ లేఖ..

రాజ్యసభ నుంచి తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ నుంచి జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ సభ్యుడు సీఎం రమేష్‌లు రిటైర్ అవుతున్నారు. ఇక కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు బుధవారం 10 మంది, గురువారం మరో 11 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గురువారం మాత్రం వైసీపీ, బీఆర్ఎస్ సభ్యులు ప్రమాణం చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Mrunal Thakur: తెలుగు ప్రేక్షకులకు మృణాల్ ఠాకూర్ సాష్టాంగ నమస్కారం

సోనియాగాంధీ తొలిసారి రాజ్యసభకు వెళ్తున్నారు. ఈసారి ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిష్క్రమించారు. దీంతో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బుధవారమే ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఆరోగ్య రీత్యా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మన్మోహన్ సింగ్ ఖాళీ చేసిన స్థానం నుంచే సోనియా తిరిగి ఎన్నికయ్యారు.

ఇది కూడా చదవండి: Kismat OTT : సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసిన కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Exit mobile version